Telangana Cabinet: రేపు జూన్ 5న జరగనున్న తెలంగాణ కేబినెట్ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనుంది. ఉద్యోగుల డిమాండ్లు, రైతు భరోసా నిధులు, యువతకు స్వయం ఉాపాధి వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. పెండింగు బిల్లుల చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రేపు జరగనున్న కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉద్యోగులు, యువత, రైతాంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉద్యోగుల డీఏ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవచ్చు. ఉద్యోగులు ఐదు డీఏలు కోరుతుంటే ప్రభుత్వం ఒక డీఏ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తోంది. రెండో డీఏ విషయంలో చర్చ జరగనుంది. పెండింగు బిల్లుల చెల్లింపుపై ఉద్యోగులు 11 వేల కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో ఎంత చెల్లించాలనే విషయంపై స్పష్టత రానుంది.
ఉద్యోగుల ఆర్థికేతర డిమాండ్లలో 44 డిమాండ్లను అధికారుల కమిటీ ప్రతిపాదించింది. ఈ డిమాండ్లను దాదాపుగా పరిష్కరించనుంది. రిటైర్మెంట్ వయసు పెంపుపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్ధిక శాఖ లో కొత్తగా స్పెషల్ సెక్రటరీ పోస్టును మంజూరు చేయనుంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పధకం ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ పధకం కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు.
Also read: Gold Silver Rates: పసిడి ప్రియులకు బిగ్ అలర్ట్, బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా>
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook