Corona Virus top 5 Immune boosting foods: కరోనా మరోసారి దేశంలో వ్యాపిస్తుంది. ఇప్పటికే దేశంలో పలు చోట్ల కరోనా కేసులు నమోదౌతున్నాయి. ఈ క్రమంలో కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఇమ్యునిటీని పెంచుకొవాలని వైద్యులు చెబుతున్నారు. గతంలో కోవిడ్ వ్యాప్తి చెందినప్పుడు.. కొన్ని రకాల ఫుడ్ స్టఫ్ లను తప్పకుండా మన డైలీ లైఫ్ యాక్టివిటీలో పెట్టుకొవాలని నిపుణులు చెబుతున్నారు.
కరోనా కొత్త వెరియంట్ లలో శరవేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే కోవిడ్ కేసులలో కేంద్రం అప్రమత్తమైంది. కోవిడ్ బారిన పడకుండా ఉండేందుకు కీలక సూచనలు చేసింది. కరోనా వచ్చిన తర్వాత బాధపడేకంటే.. రాకుండా మన రోగ నిరోధక శక్తిని పెంచుకొవాలని నిపుణులు చెబుతున్నారు. కరోనా బారినపడకుండా ఉండేందుకు ఈ కింది టాప్ ఐదు ఆహార పదార్థాలు ఎంతగానో ఉపయోగపడతాయి.
1. అంజిర్లు:
అంజిర్లలో చాలా విటమిన్ లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అంజిర్లను రాత్రి పూట ఒక చిన్న గిన్నెలో నీళ్లను తీసుకుని దానిలో పెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే తినాలి. ఇలాడైలీ ఒక నాలుగు అంజిర్లు తింటే.. రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
2. మొలకెత్తిన గింజలు:
చాలా మంది పెసర్లు, చెనగలను నీళ్లతో నాన బెట్టి మొలకెత్తిన తర్వాత తింటారు. ఇది గతంలో కరోనా వ్యాప్తి చెందినప్పటి నుంచి ఈ అలవాటును ఫాలో అవుతున్నారు . దీని వల్ల మన జీవక్రియలకు కావాల్సిన శక్తి పుష్కలంగా లభిస్తుంది. అందుకే ప్రతిరోజు కూడా పరగడుపున.. మొలకెత్తిన గింజల్ని తింటే... రోగ నిరోధక శక్తి పెరిగి.. కరోనా కు గురికాకుండా ఉంటామని నిపుణులు సూచిస్తున్నారు.
3. నిమ్మకాయ రసం:
నిమ్మకాయంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీన్ని డైలీ నీళ్లలో వేసుకుని, తేనెతో కలిపి తీసుకుంటు ఉంటే.. క్రమంగా సి విటమిన్ మన శరీరంకు అందుతుంది. సంత్ర పండును కూడా తినాలని నిపుణులు చెబుతున్నారు. నిమ్మనును ఆహార పదార్ధాలలో కూడా తయారీలో ఉపయోగిస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.
4. పాలల్లో పసుపు :
ముఖ్యంగా ప్రతిరోజు రాత్రి పూట గ్లాసు నిండా పాలను తాగాలి. ఆ పాలల్లో.. చిటికెడు పసుపును వేసుకుని తాగాలి. ఇలా డైలీ పాలు, పసుపు తాగితే మనకు నేచురల్ ఇమ్మున్ బూస్టర్ లాగా పనిచేస్తుంది. దీని ప్రభావం వల్ల కరోనా తొందరగా వ్యాపించదు.
5. ఆకుకూరలు:
తాజాగా, ఉండే ఆకుకురల్ని ఎక్కువగా తింటు ఉండాలి. ముఖ్యంగా పాలకూర, మెంతీ కూర, తోటకూర, బచ్చలి కూరల్ని ఎక్కువగా వంటలలో ఉపయోగించాలి. ఈ ఆకుకూరల్ని డైలీ ఒకటి మీ ఫుడ్ ప్లాన్ లో ఉండేలా చూసుకొవాలి.
Read more: Coronavirus: కరోనా కొత్త వేరియంట్ లక్షణాలు ఏంటి, కేసుల తీవ్రత ఎలా ఉంది
6. తాజా పండ్లు:
ప్రస్తుతం ఒక వైపును ఎండాకాలంలో వర్షం దంచి కొడుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని రకాల పండ్లను తింటు ఉండాలి. నల్లని ద్రాక్ష పండ్లు ఈ సీజన్ లలో ఎక్కువగా మార్కెట్ లోకి అందుబాటులో ఉంటాయి. రెగ్యులర్ గా యాపిల్ పండ్లు, బనానాలు తింటు ఉంటే ఇమ్యునిటీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
వీటిని తింటు, మాస్క్ లు ధరించి, సామాజిక దూరం పాటిస్తు, ఎప్పటికప్పుడు సానిటైజర్ లతో చేతులు శుభ్రంగా కడుక్కుంటే కరోనాకు గురికారని నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి