Home> లైఫ్ స్టైల్
Advertisement

Railway Video: ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన రైల్వే సెక్యూరిటీ.. వీడియో

Train Journey: రైలు ఎక్కే సమయంలో, దిగే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని ఎన్ని జాగ్రత్తలు చెప్పినా సరే.. కొంత మంది రిస్కు చేసి ట్రైన్ దిగుతుంటారు. 

Railway Video: ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన రైల్వే సెక్యూరిటీ.. వీడియో

Train Journey: రైలు ఎక్కే సమయంలో, దిగే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని ఎన్ని జాగ్రత్తలు చెప్పినా సరే.. కొంత మంది రిస్కు చేసి ట్రైన్ దిగుతుంటారు. అలా ప్రయత్నించిన ఒక వ్యక్తి రైలు ప్లాట్ ఫామ్ ( Railway Platform ) , ట్రాక్ మధ్యలో ( Railway Track)  చిక్కుకున్న సంఘటన కళ్యాణ్ రైల్వే స్టేషన్ లో ( Railway Station ) చోటు చేసుకుంది. నడుస్తోన్న ట్రైన్ నుంచి దిగడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి బ్యాలెన్స్ కుదరక ప్లాట్ ఫామ్, ట్రాక్ మధ్య చిక్కుకున్నాడు. అక్కడే ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు చెందిన కే సాహు క్షణాల్లో స్పందించి అతడిని రక్షించగలిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media ) బాగా షేర్ అవుతోంది.

Read This Story  Also: Adheera FirstLook: అధీరా ఫస్ట్ లుక్ విడుదల

రైల్వే సిబ్బంది (Railway Security ) అక్కడ సమయానికి స్పందించాడు కాబట్టి ఆ వ్యక్తి ప్రాణాలు రక్షించగలిగాడు.. ఎవరూ లేకుండా ఉంటే ఎంత ప్రమాదం జరిగేది అంటున్నారు నెటిజెన్స్ ( Netizens ) . ట్రైన్ దిగే సమయంలో, ఎక్కే సమయంలో జాగ్రత్తగా ఉండాలి అని హితవు పలుకుతున్నారు. మరో వైపు అక్కడే గోడకు నిలబడి ఉన్న మాస్కు ధరించిన వ్యక్తిని  కొంత మంది క్లాస్ పీకుతున్నారు. అంత జరుగుతున్నా అతను ఇంచుకూడా కదలలేదు అని అంటున్నారు.

Read This Story Also:  IRCTC: ఇక ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం చాలా సులభం

 

Read More