Home> లైఫ్ స్టైల్
Advertisement

Skin Whitening Tips: రూ.10 శనగపిండితో ఇలా చేస్తే.. బ్యూటీ పార్లర్‌కు వెళ్లకుండానే ముఖం తల తలలాడుతుంది!

Skin Whitening Telugu Tips: చర్మ సమస్యలతో బాధపడుతున్న వారికి శనగపిండి ఫేస్ మాస్క్ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఫేస్ మాస్క్‌ను రోజు ముఖానికి అప్లై చేస్తే సులభంగా అన్ని చర్మ సమస్యలు తొలగిపోతాయి. అలాగే చర్మం బిగుతుగా మారుతుంది.

Skin Whitening Tips: రూ.10 శనగపిండితో ఇలా చేస్తే.. బ్యూటీ పార్లర్‌కు వెళ్లకుండానే ముఖం తల తలలాడుతుంది!

Skin Whitening Telugu Tips: ప్రతి ఒక్కరికి రోడ్డుపై వెళ్తున్నప్పుడు అందంగా కనిపించాలని అనుకుంటూ ఉంటారు. ఇందులో  భాగంగానే చాలామంది ఇంటి నుంచి బయటికి వెళ్లే క్రమంలో ముఖంపై మేకప్ వేసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది అయితే వివిధ రకాల ఫేస్ క్రీమ్స్ వినియోగించి ముఖం అందంగా కనిపించేలా చేసుకుంటారు. నిజానికి వీటన్నిటిని వినియోగించడం కంటే హోమ్ రెమిడిల్లో భాగంగా శెనగపిండిని వినియోగించడం మంచిది. 

ప్రస్తుతం చాలామంది వివిధ రకాల కారణంగా చర్మంపై మచ్చలు ఏర్పడి ప్రకాశవంతమైన చర్మాన్ని కోల్పోతున్నారు. దీని కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజానికి  వీటన్నిటి నుంచి ఉపశమనం కలిగించేందుకు శెనగపిండి క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. శనగపిండితో తయారు చేసిన ఫేస్ మాస్కు వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. 

ప్రతిరోజు ఉదయం పూట శనగపిండిని మిశ్రమంలా తయారుచేసి ముఖానికి అప్లై చేసుకుంటే మొటిమల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ముఖంపై పేరుకు  పోయే నూనెను పూర్తిగా తొలగించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల ముఖంపై మొటిమల సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే కొంతమందిలో చర్మం పొడిగా నిర్జీవంగా కూడా మారుతూ ఉంటుంది. ఇలాంటి వారికి కూడా శనగపిండి స్కిన్ మాస్క్ ఎంతగానో సహాయపడుతుంది. శనగపిండిని పేస్ట్‌లా తయారు చేసి ఉదయాన్నే ముఖానికి అప్లై చేసుకుంటే టానింగ్ వంటి సమస్యలు కూడా సులభంగా దూరమైతాయి. 

కొంతమందిలో శనగపిండి ఫేస్ మాస్క్ వినియోగించడం వల్ల కూడా చర్మం బిగుతుగా మారుతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. శనగపిండిలో ఉండే కొన్ని గుణాలు సులభంగా చర్మాన్ని రిపేర్ చేసేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా చర్మంపై రంధ్రాలు కూడా పూర్తిగా తగ్గుతూ వస్తాయి. ప్రస్తుతం చాలామంది ప్రెగ్నెంటేషన్ సమస్యతో బాధపడుతున్నారు. నిజానికి ప్రతిరోజు సెనగపిండిని మిశ్రమంలో తయారుచేసి పేస్ట్‌ను అప్లై చేసుకోవడం వల్ల ఈ పిగ్మెంటేషన్ సమస్య నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా చర్మం తెలుపు రంగులోకి మారుతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More