White Hair Problem Solution Oils Telugu: ప్రతి ఒక్కరు పొడవాటి మందపాటి జుట్టు పొందేందుకు ఎన్నో రకాల రెమెడీలు వినియోగిస్తూ ఉంటారు.. ముఖ్యంగా కొంతమంది అయితే ప్రతిరోజు జుట్టుకు నూనెను వినియోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ పొడవాటి మందపాటి జుట్టు పొందలేక పోతారు. ఇదిలా ఉంటే ఆధునిక జీవనశైలిలో భాగంగా కొంతమందిలో తెల్ల జుట్టు సమస్య కూడా విపరీతంగా పెరుగుతూ వస్తోంది. కొంతమందిలో జుట్టు ఉన్నట్టుండి పూర్తిగా తెల్లబడిపోతుంది.
తెల్ల జుట్టుతో బాధపడే వారి సంఖ్య భారత దేశవ్యాప్తంగా క్రమంగా పెరుగుతూ వస్తోందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మన దేశంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో ఈ సమస్య వస్తోంది. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయని వారు అంటున్నారు. కొంతమందిలో తెల్ల జుట్టు అనేది జన్యుపరంగా వస్తే.. మరి కొంతమందిలో ఇతర కొన్ని రకాల అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల వస్తోందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. తెల్ల జుట్టుతో బాధపడేవారు తప్పకుండా హెయిర్ డైలకు బదులుగా కొన్ని హోమ్ రెమెడీస్ ని వినియోగిస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.
మూడు రకాల నూనెలు వినియోగిస్తే తెల్ల జుట్టుతో పాటు జుట్టుకు సంబంధించిన ఎలాంటి సమస్యలైనా పూర్తిగా తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా సహజ పద్ధతిలో తయారు చేసుకున్న మూడు నూనెలను వినియోగించడం వల్ల జుట్టు వేగంగా కూడా పెరుగుతుందట. ఈ నూనెలు ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు పెరుగుదలకు ఆముదం నూనె ఎంతటి ప్రభావాన్ని చూపుతోందో.. రోజ్మేరీ నూనె కూడా అంతటి ప్రభావాన్ని చూపుతోందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఈ నూనెలో ఆముదం నూనెను కలిపి బాగా మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు.
ఈ మూడు నూనెలను జుట్టుకు అప్లై చేసి మరుసటి రోజు సాధారణ షాంపుతో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. కొబ్బరి నూనెలో తగినంత ఆముదం నూనె కలిపి, మూడు నుంచి నాలుగు చుక్కల రోజ్మేరీ ఆయిల్‌ను వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జుట్టు తెల్లబడడం పూర్తిగా తగ్గుతుంది. అలాగే ఈ మూడు రకాల నూనెలు వినియోగించడం వల్ల జుట్టు పూర్తిగా పెరుగుతుందని.. జుట్టు రాలడం కూడా తగ్గుతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. కొంతమందిలో జుట్టు పల్చబడడం వంటి సమస్యల నుంచి కూడా ఈ నూనె విముక్తి కలిగిస్తుంది. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ నూనెను వినియోగించడం మంచిది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి