Indian Passport Recovery Steps: విదేశీ ప్రయాణం అనేది అందరికీ ఒక కల. ఉన్నత విద్యాభ్యాసం.. మంచి ఉద్యోగాల కోసం వెళ్లే వారు ఎక్కువ ఉండగా.. విదేశాలను సందర్శించడానికి వెళ్తుంటారు. పాస్‌పోర్టు అనేది ఏ దేశ పౌరుడికి అయినా అత్యున్నత ధ్రువపత్రం. విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆ పాస్‌పోర్టు పోగొట్టుకునిపోతే లేదా దొంగతనం అయితే ఏం చేయాలో తెలుసా? ఎలాంటి కంగారుపడకుండా ఈ పద్ధతులు పాటించండి.
Also Read: Weight Free Biryani: బిర్యానీ ఇలా ఎన్నిసార్లు తిన్నా బరువు పెరగరు.. ఎలానో తెలుసా?
విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఉన్న పాస్‌పోర్టు కోల్పోతే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. విదేశాల్లో ఉన్న సమయంలో జేబులో రూపాయి లేకపోయినా పాస్‌పోర్టు తప్పనిసరిగా ఉండాల్సి ఉంది. విదేశాలలో అంతర్జాతీయ ప్రయాణానికి, భారతీయ పౌరుడిగా గుర్తింపు కోసం పాస్‌పోర్ట్ చాలా ముఖ్యమైనది. మరి అలాంటి పాస్‌పోర్టు పోగొట్టుకునిపోతే.. లేదంటే దొంగతనానికి గురయితే ఏం చేయాలో తెలుసా? పాస్‌పోర్టు లేకపోతే మొదట కంగారుపడరాదు. పాస్‌పోర్టు తిరిగి పొందడమే కాకుండా.. అక్కడి నుంచి స్వదేశానికి సురక్షితంగా రావడానికి ఈ పద్ధతులు పాటించండి.
Also Read: Wine Shops Close: తెలంగాణలో వైన్ షాపులు బంద్.. ఎప్పుడు? ఎందుకో తెలుసా?
పాస్‌పోర్టు తిరిగి పొందే పద్ధతులు
పోలీసులకు సమాచారం
పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నా.. దొంగతనానికి గురయినా మొదట పోలీసులకు ఫిర్యాదు చేయాలి. విదేశాల్లో మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసి పోలీస్ రిపోర్ట్ కాపీని తప్పకుండా తీసుకోవాలి.
Also Read: Employees Gift: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ కానుక.. ఆ సేవ మరో ఏడాది పొడిగింపు
రాయబార కార్యాలయంలో ఫిర్యాదు
పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం వెంటనే అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి. పాస్‌పోర్టు పోగొట్టుకోవడంతో ఏం చేయాలనే దానిపై రాయబార కార్యాలయం దిశానిర్దేశం చేస్తుంది. డూప్లికేట్ పాస్‌పోర్ట్ ఇవ్వడం లేదా అత్యవసర సర్టిఫికేట్ అనేది అందిస్తుంది.
కొత్త పాస్‌పోర్ట్ కోసం..
రాయబార కార్యాలయంలో కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా అత్యవసర సర్టిఫికేట్‌ను పొందవచ్చు. ఇది తాత్కాలిక ప్రయాణ పత్రం. కొత్త పాస్‌పోర్ట్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రణాళిక ప్రకారం విదేశాల్లో పర్యటించవచ్చు.
Also Read: D Mart Salaries: డీమార్ట్ ఉద్యోగులకు జీతం ఎంత ఉంటుందో తెలుసా?
వీసా జారీ
పోగొట్టుకున్న పాస్‌పోర్ట్‌పై వీసాల ముద్ర ఉంటాయి. పాసుపోర్టు పోగొట్టుకోవడంతో సంబంధిత రాయబార కార్యాలయం నుంచి వీసా తిరిగి జారీ పొందడం కోసం దరఖాస్తు చేసుకోవాలి. త్వరగా మళ్లీ వీసా రావడానికి పోలీసు ఇచ్చిన ఫిర్యాదు పత్రం దోహదం చేస్తుంది.
ప్రయాణం షెడ్యూల్
మీరు బయలుదేరే రోజున మీ పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటే.. మీ ఎయిర్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలి. పోలీస్ రిపోర్టుతోపాటు ఎంబసీ పత్రం ఉంటే మీ విమాన ప్రయాణాన్ని తిరిగి షెడ్యూల్ చేస్తారు.
బీమా సదుపాయం
అంతర్జాతీయ ప్రయాణ బీమా ఉంటే వెంటనే మీ ప్రొవైడర్‌ను సంప్రదించాలి. పోలీసు రిపోర్టు, వీసా ఫీజులు, విమాన ఛార్జీలు వంటివి పొందవచ్చు. పాస్‌పోర్ట్ కోల్పోవడం వల్ల కలిగే ఖర్చులలో కొంత భాగాన్ని తిరిగి పొందడంలో ప్రయాణ బీమా కొంత మేలు చేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook