Home> ఎన్ఆర్ఐ
Advertisement

Australia Bhagavad Gita: ఆస్ట్రేలియా చరిత్రలో తొలిసారి.. భగవద్గీత సాక్షిగా సెనేటర్‌ ప్రమాణస్వీకారం

Australia Senator Varun Ghosh: ప్రపంచవ్యాప్తంగా హిందూ మతం వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాల్లో హిందూవులు సత్తా చాటుతున్నారు. ఇటీవల దేశంలో జరిగిన రామ మందిరం ప్రాణ ప్రతిష్ట వేడుకను ప్రపంచమంతా సంబరాలు చేసుకుంది. తాజాగా ఆస్ట్రేలియాలో తొలిసారి భగవద్గీతపై ఓ ప్రజాప్రతినిధి ప్రమాణస్వీకారం చేశారు.

Australia Bhagavad Gita: ఆస్ట్రేలియా చరిత్రలో తొలిసారి.. భగవద్గీత సాక్షిగా సెనేటర్‌ ప్రమాణస్వీకారం

Varun Ghosh Oath On Bhagavad Gita: అయోధ్య ఆలయ ప్రాణ ప్రతిష్టను యావత్‌ ప్రపంచం వీక్షించింది. ప్రపంచంలోని హిందూవులంతా సంబరాలు చేసుకున్నారు. అంతలా ప్రపంచంలో హిందూ మతం విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచంలోని హిందూవులు ఆయా దేశాల్లో కీలక పదవులు పొందుతున్నారు. బ్రిటన్‌ ప్రధానమంత్రిగా రిషి సునాక్‌ ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన ఎప్పటికప్పుడు హిందూ మతంపై భక్తిని చాటుకుంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియాలోనూ ఓ ప్రజాప్రతినిధి హిందూమతం ఉన్న అభిమానం, భక్తిని చాటుకున్నారు. ఆస్ట్రేలియా చరిత్రలోనే తొలిసారి ఇలా జరగడం.

Also Read: Bhadrachalam: భద్రాద్రి రామయ్య కల తీరింది.. బంగారు వాకిలి ముందు వెండి వాకిలి వాలింది

ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన బారిస్టర్‌ వరుణ్‌ ఘోష్‌ అక్కడి సెనేటర్‌గా (ఎంపీ) ఎన్నికయ్యారు. సెనేటర్‌గా ఆస్ట్రేలియా పార్లమెంట్‌ భవనంలో భగవద్గీత సాక్షిగా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఆస్ట్రేలియా పార్లమెంట్‌ చరిత్రలో తొలిసారి వరుణ్‌ ఘోష్‌ భగవద్గీతను ఉపయోగించారు. ఆస్ట్రేలియ పార్లమెంట్‌లో హిందూ మత పవిత్ర గ్రంథంపై ప్రమాణం చేసిన తొలి ఎంపీగా వరుణ్‌ ఘోష్‌ అరుదైన ఘనత సాధించారు. చిన్న వయసులో అక్కడి రాజకీయాల్లో ప్రవేశించి నేడు సేనేటర్ గా ఎన్నికయ్యాడు

Also Read: Vishnu Idol: కృష్ణా నదిలో ప్రత్యక్షమైన విగ్రహాలు.. అయోధ్య రాముడి రూపంలో శ్రీమహావిష్ణువు, శివలింగం

భారత మూలాలున్న వరుణ్‌ ఘోష్‌ ఆస్ట్రేలియాలో బాగా స్థిరపడ్డారు. లెజిస్లేటివ్‌ అసెంబ్లీ, లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ఫెడరల్‌ పార్లమెంట్‌ సెనేట్‌లో వరుణ్‌ ఘోష్‌ పశ్చిమ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సెనేటర్‌గా ఎన్నికైన వరుణ్‌ ఘోష్‌ను ఆ దేశ ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్‌ అభినందించారు. ఘోష్‌కు స్వాగతం పలుకుతూ ఆ దేశ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌ అభినందిస్తూ 'ఎక్స్‌'లో ఓ పోస్టు చేశారు. 'కొత్త సెనేటర్‌ వరుణ్‌ ఘోష్‌కు స్వాగతం. భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి సెనేటర్‌ మీరు. మీరు పశ్చిమ ఆస్ట్రేలియావాసులకు బలమైన వాణి వినిపిస్తారని విశ్వసిస్తున్నా' అని ట్వీట్‌ చేశారు.

వరుణ్‌ జీవితచరిత్ర
ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో నివసిస్తున్న వరుణ్‌ ప్రముఖ న్యాయవాది. వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్‌ అండ్‌ లాలో పట్టా పొందారు. కేం బ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో స్కాలర్‌ కూడా. న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ అనేక బాధ్యతలు చేపట్టారు. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో ప్రపంచ బ్యాంక్‌ సలహాదారుగా పని చేసి గుర్తింపు పొందారు. అనంతరం న్యూయార్క్‌ ఫైనాన్స్‌ అటార్నీగా పని చేశారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అక్కడి లేబర్‌ పార్టీలో చేరి ఇప్పుడు సేనేటర్‌గా గెలిచారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Read More