Dallas Massive Accident: అమెరికాలో ఘోర ప్రమాదం సంభవించింది. సరదాగా కుటుంబంతో కలిసి సెలవు రోజులను ఎంజాయ్ చేయడానికి బంధువుల ఇంటికి వెళ్లిన కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడింది. రాంగ్ రూట్‌లో వచ్చిన మినీ ట్రక్ అకస్మాత్తుగా వచ్చి వారు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో కారు అదుపు తప్పి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో హైదరాబాద్ కుటుంబం మంటల్లో సజీవ దహనమైంది. ఈ వార్తతో హైదరాబాద్‌లో తీవ్ర విషాదం ఏర్పడింది.
Also Read: KTR Wildfire: 'రేవంత్ రెడ్డికి కోతలు సరిపోవు.. కర్రుకాల్చి వాత పెట్టాలి'
హైదరాబాద్‌కు చెందిన తేజస్విని, శ్రీ వెంకట్ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఈ కుటుంబం అమెరికాలోని డల్లాస్‌లో స్థిరపడింది. పిల్లలకు సెలవులు ఉండడంతో అట్లాంటాలోని బంధువుల ఇంటికి కారులో వెళ్లారు. వారం రోజుల పాటు అట్లాంటాలో సరదాగా గడిపి కుటుంబంతో హాయిగా ఉన్నారు. అట్లాంట నుంచి తిరిగి డల్లాస్ వస్తుండగా మార్గమధ్యలో మినీ ట్రక్కు రాంగ్ రూట్‌లో వచ్చింది. మినీ ట్రక్కు అత్యంత వేగంగా ఢీకొట్టడంతో కారు అదుపు తప్పి మంటలు చెలరేగాయి.
Also Read: KT Rama Rao: 'సీతక్క మంత్రి పదవికి రాజీనామా చేయాలి.. లేదంటే తడాఖా చూపిస్తాం'
గ్రీన్ కౌంటి ఏరియాలో రాంగ్ రూట్‌లో వచ్చి కారును మినీ ట్రక్కు ఢీకొట్టడంతో కారు ప్రమాదానికి గురయ్యింది. ట్రక్ ఢీకొనడంతో కారు మొత్తం మంటల్లో చిక్కుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న తేజస్విని, శ్రీవెంకట్‌తోపాటు వారి ఇద్దరు పిల్లలు సజీవ దహనమయ్యారు. కారు మొత్తం బూడిద కావడంతో ఎముకలను ఫోరెన్సిక్‌కు పోలీసులు పంపారు. డీఎన్ఏ శాంపిల్ తీసుకొని మృతదేహాలను పోలీసులు అప్పగించనున్నారు. హైదరాబాద్‌లో వెంకట్, తేజస్విని కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook