PHOTOS

8th Pay Commission: కొత్త పే కమిషన్‌ ఏర్పాటుపై సస్పెన్స్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులూ డోంట్ వర్రీ..!

8th Pay Commission Salary Hike: 8వ వేతన సంఘ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినా.. ఇప్పటివరకు కమిటీ ఏర్పాటు చేయకపోవడంతో ఉద్యోగులు కాస్త ఆందోళనలో ఉన్నారు. అయితే కొత్త పే కమిషన్ సిఫార్సులు జనవరి 2026 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం లేకపోయినా.. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే..?
 

Advertisement
1/7

ఈ ఏడాది జనవరిలో 8వ వేతన సంఘంపై మోదీ సర్కారు ప్రకటన చేసింది. అయితే ఇప్పటివరకు కమిటీ ఛైర్మన్‌తోపాటు సభ్యులను నియామకం ఇంకా చేపట్టలేదు. కమిటీ ఏర్పాటు పూర్తయితే ఉద్యోగుల శాలరీ స్ట్రక్చర్, ఇతర విషయాలపై అధ్యయనం చేయనుంది.  

2/7

కమిటీ తన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తరువాత ఈ సిఫార్సులను అమలు చేస్తుంది. అయితే ప్రస్తుతం ఇంకా కమిటీ ఏర్పాటు కూడా పూర్తి కాకపోవడంతో 8వ వేతన సంఘం మరింత ఆలస్యం అవుతుందని ప్రచారం జరుగుతోంది.  

3/7

కమిటీ ఏర్పాటు చేసిన తరువాత సిఫార్సులు, నిబంధనలు రూపొందించేందుకు కనీసం ఏడాది పడుతుందని అంటున్నారు. మే నెలలో కొత్త పేకమిషన్ కమిటీ ఏర్పాటు జరుగుతుందని అందరూ ఊహించినా.. ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకోలేదు. కమిటీ ఏర్పాటుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు.  

4/7

అయితే కమిటీ ఏర్పాటుపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొత్త కమిటీ సిఫార్సులు ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం.. జనవరి 1, 2026 నుంచి జీతాల పెంపును అమలు చేస్తారని నిపుణులు చెబుతున్నారు.    

5/7

7వ వేతన సంఘం సిఫార్సులు డిసెంబర్ 2025 ముగుస్తాయి. అందుకే కొత్త పే కమిషన్ సిఫార్సులు ఆలస్యమైనా.. జనవరి 1, 2026 నుంచే పరిగణనలోకి తీసుకుంటారని అందరూ భావిస్తున్నారు.  

6/7

8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92 - 2.86 పరిధిలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92గా నిర్ణయిస్తే.. లెవల్-1 ఉద్యోగుల జీతం రూ.34,560 పెరుగుతుంది. లెవల్-10 వరకు ఉద్యోగులకు రూ.1,07,712 వరకు పెంపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.  

7/7

ఇక ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను గరిష్టంగా 2.86గా ఫిక్స్ చేస్తే.. కనీస పెన్షన్ రూ.9 వేల నుంచి రూ.25,740కి పెరగవచ్చని అంటున్నారు. కమిటీ సిఫార్సుల నిబంధనలకు లోబడి జీతాలు, పెన్షన్ పెంపు ఉంటుంది.   





Read More