PHOTOS

Akshaya Tritiya 2025: 100 యేళ్ల తర్వాత అక్షయ తృతీయ రోజు అరుదైన అద్భుత యోగాలు.. ఈ రాశుల వారి ఇంట్లో లక్ష్మీ దేవి తాండవం చేస్తోంది..

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ ప్రతీ యేడాది హిందూ కాలండర్ ప్రకారం వైశాఖ మాస శుద్ధ తృతీయ రోజు వస్తూ ఉంటుంది. ఈ రోజు పరశురాముడి జయంతి. మరోవైపు సింహాచలంలో అప్పన్న స్వామి నిజ రూప దర్శనం ఇచ్చే రోజు. ఇలాంటి అద్భుతమైన రోజున అరుదైన ఆరు యోగాలు ఏర్పడబోతున్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.

 

Advertisement
1/6
అక్షయ తృతీయ 2025
అక్షయ తృతీయ 2025

Akshaya Tritiya 2025: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, దాదాపు 100 యేళ్ల తర్వాత, అక్షయ తృతీయ నాడు ప్రత్యేక రాజయోగాలు కలిసి ఏర్పడుతున్నాయి. ఈ యేడాది అక్షయ తృతీయ ఏప్రిల 30వ తేదిన వస్తుంది. ఈ రోజున ఆరు అద్భుత యోగాలు సిద్ధించబోతున్నాయి.

2/6
బలమైన యోగాలు
బలమైన యోగాలు

ఈ రోజున బలమైన గజకేసరి రాజయోగం, లక్ష్మీ నారాయణ రాజయోగం, మాళవ్య రాజయోగం, చతుర్గ్రాహీ యోగం, సర్వార్థ సిద్ధి యోగం, రవియోగం ఏర్పడుతున్నాయి. దీని వలన మూడు రాశుల వారికి కుబేర సంపద లభిస్తుంది.

3/6
మకర రాశి
మకర రాశి

మకర రాశి: మకర రాశి వారికి అక్షయ తృతీయ నాడు ఏర్పడే అరుదైన రాజయోగాల ప్రభావం వల్ల ఈ రాశి వారికి చేస్తోన్న పనిలో ప్రమోషన్లు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  విదేశీ వాణిజ్యం నుండి భారీ లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. ఇంట్లో ధన ప్రవాహం అధికంగా ఉండే అవకాశం ఉంది. జీవితంలో సుఖాలు,  సౌకర్యాలు గతంలో కంటే పెరుగుతాయి.

4/6
సింహ రాశి
సింహ రాశి

సింహ రాశి: అక్షయ తృతీయ నాడు సింహా రాశి అనుకోని ప్రయోజనాలు దగ్గబోతున్నాయి. ఈ రాశి ఉద్యోగ స్త్రీ, పురుషులకు ఉద్యోగంలో  పదోన్నతులు లభించే అవకాశాలున్నాయి. పాత పెట్టుబడుల నుండి భారీ లాభాలను అందుకుంటారు. సమాజంలో మీ హోదా కూడా పెరుగుతుంది.

5/6
తుల రాశి
తుల రాశి

తుల రాశి: అక్షయ తృతీయ నాడు తుల రాశి వారికి బంగార మయంగా ఉండబోతుంది.  ఈ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలను తీసుకురాబోతుంది. ఇది జీవితంలో మీరు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికి దోహద పడుతుంది.  మీ కెరీర్, వ్యాపారంలో సానుకూల మార్పుల కారణంగా మీరు కుబేరుని ఆశీస్సులతో గతంలో కంటే ఐశ్వర్యవంతులు అవుతారు.

6/6
గమనిక
గమనిక

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు,  జ్యోతిష్యులు, పండితులు, సనాతన హిందూ ధర్మశాస్త్రల నుంచి స్వీకరించి అందించినది.  ZEE NEWS దీనిని ధృవీకరించడం లేదు.





Read More