PHOTOS

Akshaya Tritiya: 82 యేళ్ల తర్వాత అక్షయ తృతీయ నాడు 3 అరుదైన యోగాలు.. పూర్వీకుల ఆస్తి కలిసొచ్చే అవకాశం..

Akshaya Tritiya: అక్షయ తృతీయ .. వైశాఖ శుద్ద తదియ నాడు వస్తుంది. ఈ రోజు ఏ పనిచేసినా.. అక్షయం అంటే క్షయము లేని అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి దీన్ని అక్షయ తృతీయగా పిలుస్తుంటారు. కానీ ఈ సారి వైశాఖ శుద్ద తదియ 30వ తేదిన వస్తుంది. ఈ రోజు మూడు యోగాలు సిద్దించబోతున్నాయి.

Advertisement
1/7
అక్షయ తృతీయ
అక్షయ తృతీయ

Akshaya Tritiya:  జ్యోతిషశాస్త్రం ప్రకారం..అక్షయ తృతీయ రోజున  మూడు అరుదైన యోగాలు ఏర్పడబోతున్నాయి. హిందూ సనాతన సంప్రదాయంలో అక్షయ తృతీయకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ యేడాది  ఈ పవిత్రమైన రోజున రవి యోగం, శోభన యోగంతో పాటు సర్వార్ధ సిద్ది యోగం వంటి అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. దీంతో కొన్ని రాశల వారికీ అక్షయమైన ఫలితాలను అందించబోతుంది. ఈయేడాది విశ్వావసు నామ సంవత్సరంలో ఏప్రిల్ 30న వస్తోంది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, అక్షయ తృతీయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.సరిగ్గా 82 యేళ్ల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మూడు అరుదైన యోగాలు ఏర్పడబోతున్నాయి.

2/7
మకర రాశి
మకర రాశి

మకర రాశి: 2025 లో అక్షయ తృతీయ నుండి, మకర రాశి వారికి జీవితం మారబోతుంది. ఇప్పటికే మకరం వారికి ఏల్నాటి శని ప్రభావం పూర్తిగా తొలిగిపోయింది. ఈ యవ్యాపారంలో ఆకస్మిక ఆర్థిక లాభాలు మీ క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. అదృష్టం మద్దతుతో, మీరు కొత్త వ్యాపారాలలో భారీ లాభాలను అందుకుంటారు.

3/7
తుల రాశి
తుల రాశి

తుల రాశి: అక్షయ తృతీయ నాడు మూడు శుభ యోగాలతో వచ్చే అక్షయ తృతీయ.. ఈ రాశి వారికి కొత్త ఆదాయ వనరులను తీసుకురాబోతుంది.  ఈ సమయంలో, భూమి, వాహనాల కొనుగోలు ద్వారా లాభాలు అందుకునే అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఎంతో మెరుగ్గా ఉండే అవకాశాలున్నాయి.

4/7
కర్కాటక రాశి
కర్కాటక రాశి

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి 2025 అక్షయ తృతీయ నాడు వీరి జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకురాబోతుంది.  మీ కెరీర్‌లో మీ కష్టానికి తగిన ప్రతిఫలాలను అందుకుంటారు. అంతేకాదు జీతం పెరుగుదలతో పాటు ఉద్యోగలో ప్రమోషన్ అందుకుంటారు.  జీవితం ఆనందమయంగా ఉండనుంది.

 

5/7
కుంభ రాశి
కుంభ రాశి

కుంభ రాశి:

అక్షయ తృతీయ నుంచి కుంభ రాశి వారి జీవితంలో అనూహ్యమైన మార్పులు సంభవించబోతున్నాయి. అంతేకాదు ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది.వ్యాపారస్తులు ఊహించని లాభాలు ఆర్జిస్తారు.  పూర్వీకులకు సంబంధించిన ఆస్తులు కలిసొచ్చే అవకాశాలున్నాయి.  ఆస్తి లావాదేవీలకు సంబంధించిన కోర్టు కేసులలో తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది.

 

6/7
వృషభ రాశి
వృషభ రాశి

వృషభ రాశి: అక్షయ తృతీయ నాడు ఏర్పడే మూడు శుభయోగాలతో వృషభ రాశి వారికి వృత్తి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో అనుకోని విజయాలను అందుకుంటారు. వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు. మీరు పెట్టుబడి నుండి భారీ రాబడిని అందుకుంటారు.

 

7/7
గమనిక
గమనిక

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం, జ్యోతిష్యులు, పండితులు, సనాతన హిందూ ధర్మశాస్త్రల ప్రకారం అందించాము.  ZEE NEWS దీనిని ధృవీకరించడం లేదు.





Read More