Know About Anant Ambani Salary Details: ప్రపంచంలోనే ధనవంతుడైన పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ జీతం ఎంత తీసుకుంటున్నాడో తెలుసా? అతడి వేతనం గురించి షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల కొత్త బాధ్యతలు చేపట్టిన అనంత్ సంవత్సరానికి ఎంత తీసుకుంటున్నాడో తెలుసుకుందాం.
ముకేశ్ అంబానీకి తన ముగ్గురు పిల్లలు ఈశా అంబానీ, ఆకాశ్ అంబానీల కన్నా అనంత్ అంబానీ అంటే ఎంతో ఇష్టం. అందుకనే మిగతా వారికన్నా తొలుత అనంత్ అంబానీ రిలయన్స్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌గా నియమించారు.
అనంత్ అంబానీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ కావడంతో ప్రస్తుతం ముకేశ్ ఇద్దరు ఆకాశ్, ఈశా రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్నారు. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్న వీరికి ఎలాంటి జీతం రాకపోవడం గమనార్హం.
జీతం రాకపోయినా బోర్డు సమావేశాలకు హాజరయ్యే ఆకాశ్, ఈశాతోపాటు సిట్టింగ్ ఫీజు, కంపెనీ లాభాల్లో కమీషన్ లభిస్తుంది. అలా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒక్కొక్కరికి రూ.4 లక్షలు ఫీజు రాగా.. కంపెనీ లాభంపై కమీషన్ రూపంలో రూ.97 లక్షలు దక్కాయి.
2025 ఏప్రిల్‌లో అనంత్ అంబానీ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యాడు. ఇప్పుడు కంపెనీ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులైన అనంత్ అంబానీ మే 1వ తేదీన బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగనున్నాడు.
షేర్‌హోల్డర్ నోటీసు ప్రకారం అనంత్ అంబానీ సంవత్సరానికి రూ.10 నుంచి 20 కోట్లు జీతంగా పొందుతున్నట్లు తెలిసింది. జీతం ఒక్కటే కాకుండా అనంత్ అంబానీకి కంపెనీ లాభాలపై కమీషన్ సహా అనేక ప్రోత్సాహకాలు (అలవెన్స్) కూడా వస్తాయి.
వసతి, ప్రయాణం, మెడికల్ రీయింబర్స్‌మెంట్‌తోపాటు సంస్థ కల్పించే భద్రత సదుపాయాలు వంటివి అదనంగా అనంత్ అంబానీకి లభిస్తాయి. అలవెన్స్‌ల విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి.