Big Twist In Chiranjeevi Mother Health Condition: సినీ నటుడు చిరంజీవి తల్లి అంజనా దేవి ఆరోగ్యం విషమంగా ఉందని వస్తున్న వార్తల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమ తల్లి అనారోగ్యం తీవ్ర చర్చనీయాంశం కావడంతో ఈ అంశంపై సినీ నటుడు, ఏపీ ఎమ్మెల్సీ నాగబాబు కీలక ప్రకటన చేశారు. తన తల్లి ఆరోగ్యం ఎలా ఉందో వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
కొణిదెల కుటుంబ పెద్ద.. సినీ నటులు చిరంజీవి, ఎమ్మెల్సీ నాగబాబు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాతృమూర్తి అంజనా దేవి అనారోగ్యానికి గురయ్యారనే వార్త మంగళవారం హల్‌చల్ చేశాయి. ఆమె అనారోగ్యంతో ఆమె తనయుడు పవన్ కల్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ వెళ్లాడని ప్రచారం జరిగింది.
తమ తల్లి అనారోగ్యంపై తీవ్ర చర్చ జరగడంతో చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆమె అనారోగ్యంపై ఒక్కసారిగా చర్చనీయాంశం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆందోళనకు తెరదించుతూ నాగబాబు కీలక ప్రకటన చేశారు.
'అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. ఆమె పూర్తిగా క్షేమంగా ఉన్నారు' అంటూ నాగబాబు ట్విటర్ (ఎక్స్)లో పోస్టు చేశారు. ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మొద్దని సూచించారు.
75 ఏళ్ల కొణిదెల అంజనా దేవికి ముగ్గురు కుమారులు చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్. ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఆమె కుటుంబం మొత్తం సినీ, రాజకీయాల్లో కొనసాగుతోంది. చిరంజీవి సినిమాలు, రాజకీయాల్లో పని చేయగా.. ప్రస్తుతం పవన్, నాగబాబు ఇద్దరూ రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద సినీ కుటుంబానికి వంశ వృక్షంగా అంజనా దేవికి 75 ఏళ్లు ఉన్నాయి. కొన్ని నెలల కిందట ఆమె పుట్టినరోజు చేసుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి తన తల్లి అంజనా దేవి యోగక్షేమాలు చూస్తున్నారు. తరచూ మెగా కుటుంబం అంజనా దేవితో కలిసి కుటుంబ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
ప్రస్తుతం అంజనా దేవి చిరంజీవి నివాసంలో హాయిగా ఉన్నారని కొణిదెల కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. రామ్ చరణ్ కుమార్తె క్లీంకారతో ఆడుకుంటూ శేష జీవితాన్ని ఆమె సంతోషంగా పొందుతున్నారు. ఆమె అనారోగ్యంపై ఇలాంటి పుకార్లు సరికాదని మెగా ఫ్యామిలీ కొట్టిపారేసింది.