PHOTOS

Bitcoin: బంగారం వద్దంటూ.. బిట్‎కాయిన్ వెంటపడిన ఇన్వెస్టర్లు.. హిస్టరీలోనే తొలిసారిగా రూ.1కోటికి చేరిన ధర..!!

Bitcoin Hits New All-Time High: బిట్ కాయిన్ రికార్డ్ బ్రేక్ చేసింది. చరిత్రలోనే తొలిసారిగా కోటి మార్క్ ను చేరింది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన..అత్యంత డిమాండ్ కలిగిన అతిపెద్ద క్రిప్టో  కరెన్సీ బిట్ కాయిన్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించింది. జూలై 9వ తేదీనాడు రికార్డు స్థాయిలో  దూసుకుపోయింది. డిజిటల్ ఆస్తులపై పెరుగుతున్న విశ్వాసంతో పాటు పెద్ద పెద్ద ఆర్థిక సంస్థ మద్దతుతో బిట్ కాయిన్ ధరలు ఆకాశాన్నంటాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ఉపయోగించే డిజిటల్ కరెన్సీపై ఇన్వెస్టర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం బిట్ కాయిన్ ధర 111,988.90 డాలరుగా ఉంది. అంటే భారత కరెన్సీలో రూ. 95,88,993 చేరిందన్నమాట. 
 

Advertisement
1/7
ఆర్థిక మాంద్యం
ఆర్థిక మాంద్యం

ఇక ఓవైపు ఆర్థిక మాంద్యం భయాల నడుమ క్రిప్టో కరెన్సీ అత్యంత సురక్షితమైన డిజిటల్ కరెన్సీగా మారిందని చెప్పవచ్చు. దీంతో పెట్టుబడిదారులు ఈ బిట్ కాయిన్ పై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గత 24గంటల్లోనే బిట్కాయిన్ ధర 111, 988.90 డార్లలను తాకింది. 

2/7
బిట్ కాయిన్ 18శాతం వ్రుద్ధి
బిట్ కాయిన్ 18శాతం వ్రుద్ధి

చివరిగా 111, 259 డాలర్ల వద్ద అంటే 0.4శాతం పెరుగుదలతో ట్రేడ్ అవుతోంది. 2025 ఆరంభం నుంచి ఇప్పటి వరకు బిట్ కాయిన్ 18శాతం వ్రుద్ధిని సాధించిందని చెప్పవచ్చు. ఈ ఏడాది అత్యుత్తమ ప్రతిభ చూపుతున్న ఆస్తుల్లో బిట్ కాయిన్ ఒకటిగా నిలిచిందని చెప్పవచ్చు.   

3/7
ప్రొఫెషనల్ క్యాపిటల్ మేనేజ్ మెంట్
ప్రొఫెషనల్ క్యాపిటల్ మేనేజ్ మెంట్

ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ సంస్థ అయిన ప్రొఫెషనల్ క్యాపిటల్ మేనేజ్ మెంట్ సీఈవో ఆంథనీ పోంప్లియానో స్పందిస్తూ...బిట్ కాయిన్ మార్కెట్ వృద్ధి చెందుతున్నా కొద్దీ అది మరింత సురక్షితమైన పెట్టుబడిగా మారుతుందన్నారు. ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను దాటడం వల్ల పెద్ద ఆర్థిక సంస్థలు కూడా ఇప్పుడు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు చెబుతున్నారు.

4/7
బిట్ కాయిన్ ఆస్తులను కొనుగోలు
 బిట్ కాయిన్ ఆస్తులను కొనుగోలు

 డిజిటల్ కరెన్సీలకు దూరంగా ఉన్న ప్రముఖ సంస్థలన్నీఇప్పుడు బిట్ కాయిన్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో ధరలు అమాంతం  పెరిగిపోతున్నాయి.   

5/7
అమెరికా ఫెడరల్ రిజర్వ్
అమెరికా ఫెడరల్ రిజర్వ్

ఈ ఏడాది జూన్ లో జరిగిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశానికి సంబంధించి వివరాలు వెలువడ్డ తర్వాత మార్కెట్లో రిస్క్ తో కూడిన సెంటిమెంట్ జరిగింది. 2025లో కనీసం ఒక్కసారి వడ్డీరేట్లు తగ్గే ఛాన్స్ ఉందని పలువురు పాలసీ మేకర్లు సూచించడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం మరింత పెరిగిందని చెప్పవచ్చు. 

6/7
క్రిప్టో అనుకూల ధోరణి
క్రిప్టో అనుకూల ధోరణి

ఇక అమెరికా రాజకీయ పరిస్థితుల్లో క్రిప్టో అనుకూల ధోరణి కూడా బిట్ కాయిన్ కు మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలన క్రిప్టో ఫ్రెండ్లీగా మారుతుండటంతో ట్రేడర్లు మరింత ధైర్యంగా ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నవారు.   

7/7

Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో  పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.





Read More