PHOTOS

Temba Bawuma: పొట్టోడు..పొట్టోడు అంటే బ్యాట్‌తో కొడతా.. ఆస్ట్రేలియాకు అసలైన మొగుడు వీడే...!!

Temba Bawuma made history: పొట్టోడే కానీ గట్టోడు..అనే సామేత మీకు తెలిసే ఉంటుంది. ఈ సామేత టెంబా బావుమాకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే చూడటానికి బావుమా పొట్టిగా కనిపించినా..తనకు క్రికెట్ పై ఎంతో నైపుణ్యం ఉంది. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో బవుమా అర్థ సెంచరీతో తన సత్తా చూపించాడు. ఎయిడెన్ మర్క్ రమ్ తో కలిసి మూడో వికెట్ కు అజేయంగా 143 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా విజయానికి..ఓటమికి టెంబా బావుమా అడ్డుగోడలా నిలిచాడు. 
 

Advertisement
1/7
టెంబా బావుమా చరిత్ర సృష్టించింది:
టెంబా బావుమా చరిత్ర సృష్టించింది:

Temba Bawuma made history: దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా చరిత్ర సృష్టించారు. జో రూట్, స్టీవ్ స్మిత్,  విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్ళు ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్‌లో చేయలేని చారిత్రాత్మక ఘనతను అతను చేశాడు. WTC చివరి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన ప్రపంచంలో రెండవ కెప్టెన్‌గా అతను నిలిచాడు. అతని ముందు ఈ పెద్ద విజయం న్యూజిలాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేరు మీద మాత్రమే నమోదైంది. కానీ ఈ పెద్ద విజయం ఇప్పుడు కంగారూ జట్టుపై కెప్టెన్‌గా హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా బావుమా పేరులో కూడా చేరింది. 

2/7
బావుమా బ్యాట్ చెలరేగిపోతోంది
 బావుమా బ్యాట్ చెలరేగిపోతోంది

2023-25 ​​ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్‌లో బావుమా బ్యాట్ చెలరేగిపోతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన బావుమా, రెండవ ఇన్నింగ్స్‌లో 65 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఈ సమయంలో, క్రికెట్ ప్రేమికులు అతని బ్యాట్ నుండి ఐదు అందమైన ఫోర్లను చూశారు.

3/7
ఇంకా 69 పరుగులు అవసరం
ఇంకా 69 పరుగులు అవసరం

ఆఫ్రికన్ జట్టు గెలవడానికి ఇంకా 69 పరుగులు అవసరం. అదే సమయంలో, బావుమా తన ఐదవ టెస్ట్ సెంచరీకి కేవలం 35 పరుగుల దూరంలో ఉన్నాడు. నాల్గవ రోజున అతను కొన్ని ముఖ్యమైన పరుగులు త్వరగా సాధించడం ద్వారా ఈ ఘనతను పూర్తి చేస్తాడని భావిస్తున్నారు.

4/7
రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన సౌతాఫ్రికా
రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన సౌతాఫ్రికా

రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన సౌతాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 56 ఓవర్లలో 2 వికెట్లకు 213 పరుగులు చేసింది. సౌతాఫ్రికా విజయానికి ఇంకా 69 పరుగులు అవసరం ఉంది. ఆస్ట్రేలియాకు 8 వికెట్లు అవసరం. 4వ రోజు ఆటలో అద్బుతం జరిగితే తప్పా ఈ మ్యాచులో ఆస్ట్రేలియా గెలివలేదు. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 138 పరుగులకే ఆలౌటైన సౌతాఫ్రికా 282 పరుగుల లక్ష్యాన్ని చేధిస్తుందని ఎవరూ ఊహించలేరు.

5/7
పిచ్ అనూహ్యంగా బ్యాటింగ్ కు అనుకూలం
పిచ్ అనూహ్యంగా బ్యాటింగ్ కు అనుకూలం

పిచ్ అనూహ్యంగా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటం..మార్క్ రమ్ సెంచరీ..బావుమా హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో ఈ మ్యాచ్ పై సఫారీ టీమ్ పట్టు బిగించింది. అయితే మార్క్ రమ్ కు బావుమా అండగా నిలవడంతోనే ఇది సాధ్యం అయ్యింది. ఓ వైపు మార్క్ రమ్ స్వేచ్ఛగా ఆడగా..మరోవైపు బావుమా తనదైన బ్యాటింగ్ తో ఆసీస్ పేసర్ల సహనాన్ని పరీక్షించాడు.   

6/7
సోషల్ మీడియా వేదికగా ఎగతాలి
సోషల్ మీడియా వేదికగా ఎగతాలి

ఇక తొలి ఇన్నింగ్స్ లో బావుమా తన మొదటి రన్ కోసం 30 బంతులు ఆడాడు. ఇది ఆస్ట్రేలియా  అభిమానులు నవ్వుతూ..సోషల్ మీడియా వేదికగా ఎగతాలి చేశారు. కానీ అదే బావుమా రెండో ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా గెలుపు బాధ్యతను తను భుజాలపై వేసుకుని..మార్క్ రమ్ సెంచరీ చేసినా..అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్ తో అతనికి అండగా నిలిచాడు బావుమా. ఓ వైపు తొడ కండరాల గాయం ఇబ్బంది పెడుతున్నా కసితో బ్యాటింగ్ చేశాడు బావుమా.   

7/7
క్రికెట్ హిస్టరీలో ఒకే ఒక్క ఐసీసీ టైటిల్ గెలుపు
క్రికెట్ హిస్టరీలో ఒకే ఒక్క ఐసీసీ టైటిల్ గెలుపు

క్రికెట్ హిస్టరీలో సౌతాఫ్రికా ఒకే ఒక్క ఐసీసీ టైటిల్ ను గెలిచింది. అది కూడా 1998లో నాకౌట్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన ఐసీసీ టోర్నీల్లో నాకౌట్ లో చేరింది. దురద్రుష్టం వెంటాడింది. ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో భారత్ చేతిలో షాక్ తగిలింది. ఈ సారైనా టైటిల్ గెలవాలన్న మరింత కసితో ఉంది. మెజార్టీ క్రికెట్ ఫ్యాన్స్ కూడా సౌతాఫ్రికానే గెలవాలని కోరుకుంటున్నారు. 





Read More