Wine Shops: కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి భగ భగలకు జనాలంతా విలవిల్లాడిపోతున్నారు. అసలు బైటకు వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు.
ఎండలు ప్రస్తుతం చుక్కలు చూపిస్తున్నాయి. అత్యవసరం అయితే తప్ప బైటకు వెళ్లకూడదని నిపుణులు ఇప్పటికే తరచుగా సూచనలు చేస్తున్నారు.. మరొవైపు ఎండలో తప్పనిసరిగా బైటకు వెళ్తే జ్యూస్ లు, నీళ్లు తరచుగా తాగుతుండాలని, కొబ్బరి నీళ్లు, చెరకు రసం తాగాలని చెప్తున్నారు. ఏ మాత్రం శరీరంలో మార్పలు వచ్చిన కూడా డాక్టర్ ను సంప్రదించాలని చెప్తున్నారు.
సమ్మర్ లో చాలా మంది ఎండల నుంచి ఉపశమనం కోసం అన్ని వయసుల వారు లిక్కర్ లను తాగుతుంటారు. వారు తాగేబ్రాండ్స్ లను బట్టి ప్రతిరోజు కూడా ఎంతో కొంత మందు కడుపులో పడాల్సిందే. చాలా మంది చుక్కలేందే అసలు నిద్రపోరు. ఈ క్రమంలొ తెలంగాణలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే మందుబాబులకు ఎక్కడ కూడా లిక్కర్ కోసం ఇబ్బందులు పడకుండా.. అదనపు బెల్ట్ షాపుల కోసం ఏర్పాట్లు చేసేలాచర్యలు తీసుకొవాలని ఆబ్కారీ శాఖకు ఆదేశాలిచ్చారు. ఇక తాజాగా.. తెలంగాణలో.. పలు ప్రాంతాలలో ఎండ నుంచి ఉపశమనం కోసం పెద్ద మనసు చేసుకున్న సీఎం రేవంత్ ఇన్ స్టాంట్ బీర్ కేఫ్ లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ముఖ్యంగా.. హైదరాబాద్ నగరంలో ప్రతి 3 కి.మీ ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇక జిల్లాలు, పట్టణాల్లో ప్రతి 30 కి.మీలకు ఒకటి చొప్పున ఇన్ స్టాంట్ వైన్ సెంటర్ లను ఏర్పాటు చేయాలని ఆబ్కారీకి ఇప్పటికే ఆదేశాలనిచ్చారని.. పైవిధంగా కసరత్తులు కూడా చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పుడైతే.. హైదరాబాద్ నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కోడ్ ముగియగానే అందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వార్తలు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇదే జరిగితే.. ఎండకాలంలో ఇది నిజంగా మందుబాబులు పాలిట భారీ గుడ్ న్యూస్ అవుతుందని కూడా నెట్టింట జోరుగా ఈ వార్త వైరల్ అవుతుంది. దీనిపై ఇప్పటి వరకు కాంగ్రెస్ సర్కారు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.