womens consume alcohol: ఇక్కడి మహిళలు రోజు మద్యంను మంచి నీళ్లలా తాగేస్తారంట. ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు మగాళ్లతో పోటీ పడి మరీ మద్యం బాటిళ్లను ఖాళీ చేస్తారనే విషయం సర్వేలో బైటపడింది.
సాధారణంగా లిక్కర్ ను చాలా ప్రభుత్వాలు లిక్కర్ ను ఆదాయ వనరుగా భావిస్తుంటారు. ఒకవైపు లిక్కర్ కొన్నిరాష్ట్రాలు బ్యాన్ చేస్తుండగా.. మరోవైపు ఇంకొన్ని రాష్ట్రాలు లిక్కర్ ధరలను పెంచుతు నిర్ణయాలు తీసుకుంటున్నాయి.దీని వల్ల మద్యనికి బానిసైన వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇటీవల కాలంలో చాలా ప్రభుత్వాలు మద్యం రేట్లను ఇష్టమున్నట్లు పెంచుతున్నాయి. అయితే.. మద్యానికి అలవాటు పడ్డవారు మాత్రం.. లిక్కర్ రేట్లు పెరిగిన కూడా మద్యంకు దూరంకాలేక తాము సంపాదించిందంతా తాగుడుకు ఖర్చుచేస్తున్నారు.
ముఖ్యంగా లిక్కర్ అనేక బ్రాండ్లలో లభిస్తుంది. సామాన్య ప్రజల నుంచి బడాబాబులు తాగే మద్యం వరకు అనేక రేట్లలో లిక్కర్ లను అనేక రకాల బ్రాండ్లు మార్కెట్ లలో అందుబాటులో ఉంటున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం చాలా మంది మోతాదుకు మించి మద్యం తాగుతూ.. ప్రభుత్వాలకు ఆదాయవనరుగా మారుతున్నారు. కానీ మరోవైపు వారి ఆరోగ్యం మాత్రం పూర్తిగా పాడయ్యేలా చేజేతులా చేసుకుంటున్నారు.
మద్యం తాగడానికి బానిసై అనేక కుటుంబాలు వీధుల్లో పడిన సందర్భాలు కొకొల్లలు, మద్యం వల్ల ఎంతో మంది ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. మరికొందరు తమకు కావాల్సిన మద్యం అందుబాటులో లేనప్పుడు వెర్రిగా కూడా ప్రవర్తిస్తుంటారు.
ప్రస్తుతం చాలా చోట్ల మహిళలు సైతం.. పురుషులకు సమానంగా అన్నిరకాల మద్యం బ్రాండ్లు తాగుతూ...రచ్చ చేస్తున్నారు. ఒకప్పటిలా కాకుండా.. ఇప్పటి మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా పోటీని ఇస్తున్నట్లు లిక్కర్ తాగడంలో కూడా తామేం తక్కువ తాగామా.. అన్న విధంగా పోటీనీ ఇస్తున్నారు.
ఇటీవల .. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక సర్వేను నిర్వహించింది. దీనిలో మన దేశంలో అత్యధిక మద్యంను అస్సాంకు చెందిన మహిళలు తాగుతున్నారని విషయం బైటపడింది. ఆ తర్వాత.. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ వంటి ఈశాన్య రాష్ట్రాలలో కూడా మద్యం సేవించే మహిళల సంఖ్య గణనీయంగా ఉంది.