Job Opportunity For Youth: యువతకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నిరుద్యోగ యువతకు మంచి శిక్షణ అందించడంతో పాటు వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించనుంది. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గ్రామీణ అభివృద్ధి సంస్థ డిఆర్డిఏ ఆధ్వర్యంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ డిడియు జికేవై ద్వారా ఈ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం చేపట్టారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
ఉద్యోగులకు కంప్యూటర్ శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించనుంది ఏపీ ప్రభుత్వం. ఇంటర్ డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివిన వారు ఈ ప్రోగ్రాం కి అర్హులు. ఈ కోర్సులో చేరాలంటే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాలు మధ్య ఉండాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువతీ యువకులకు గ్రామీణ అభివృద్ధి సంస్థ డిఆర్డిఏ డిడియు జీకేవై ద్వారా రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ Seedap వారు సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రోగ్రాం చేపట్టారు. కంప్యూటర్లో ఎమ్మెస్ ఆఫీస్, వర్డ్, ట్యాలీ, ఐటీ రంగంలో వెబ్ డెవలపర్, టెలికాం రంగంలో బ్రాడ్ బ్యాండ్ టెక్నీషియన్ కోర్సులో 90 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు
ఆసక్తి ఉన్న అభ్యర్థులకు శిక్షణతో పాటు ఉచితంగా హాస్టల్ సదుపాయం కూడా కల్పించనున్నారు. అక్కడ వారికి భోజన వసతి సదుపాయాలు తోపాటు శిక్షణ అందించనుంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చేత మెటీరియల్స్ కూడా అందించి స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కంప్యూటర్ పరిజ్ఞానం కూడా శిక్షణ ఇవ్వనున్నారు
విజయవంతంగా కోర్సు పూర్తి చేసుకున్న యువతకు సర్టిఫికెట్ కూడా అందించి 100% మెట్రో నగరాలైన హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ https://forms.gle/WKFzZmEy7WJ6gAU7A
ఈ శిక్షణ కేంద్రాలు జులై 15వ తేదీ నుంచి ప్రారంభం అవ్వనున్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే పేర్లను నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 916300373877 నంబర్ కి కాల్ చేయాలి. ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు. పై లింక్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.