Gold Rate Today: బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. గురువారంతో పోల్చితే శుక్రవారం బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 98,060 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,300 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 1,12,000 పలుకుతోంది. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా డాలర్ విలువ తగ్గడమే కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తాజా టారీఫ్స్ నేపథ్యంలో నెగెటివ్ గా స్పందించినప్పటికీ అమెరికా డాలర్ బలపడటం వల్ల బంగారం ధర తగ్గుతోంది. అమెరికా డాలర్ సూచిక 0.2శాతం మేర పెరిగింది. ఫలితంగా బంగారం ధరలు తగ్గాయని చెప్పవచ్చు.
డాలర్ బలం పెరిగేకొద్ది బంగారం విలువ అనేది తగ్గుతుంది. దీంతో బంగారం కొనుగోలు చేసేందుకు తక్కువ డాలర్లు ఖర్చు చేయాలి. అలాంటి సమయంలో బంగారం ధరలు తగ్గుముఖం పడతాయి. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ విషయానికి వస్తే ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం ధర 3325 డాలర్ల వద్ద ముగిసింది.
హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు (కమోడిటీ) సౌమిల్ గాంధీ స్పందిస్తూ.. "సురక్షిత పెట్టుబడి ఆస్తులకు తాజా డిమాండ్ కారణంగా గురువారం బంగారం ధరలు తగ్గాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలపై అనిశ్చితులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం బంగారం ధరలకు మద్దతు ఇచ్చాయి.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం స్వల్పంగా పెరిగి ఔన్స్ కు $3325.40 కు చేరుకుంది. బుధవారం అధ్యక్షుడు ట్రంప్ ఆగస్టు 1 నుండి బ్రెజిలియన్ ఉత్పత్తులపై అమెరికా 50 శాతం సుంకాన్ని విధిస్తుందని ప్రకటించారు.
అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ CEO చింతన్ మెహతా ప్రకారం, US ఫెడరల్ రిజర్వ్ FOMC (ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ) తాజా సమావేశం మినిట్స్ అధికారులు ఆర్థిక పరిస్థితి గురించి జాగ్రత్తగా విభజించారని వడ్డీ రేట్లను తగ్గించే ముందు మరిన్ని డేటా కోసం వేచి ఉండాలని కోరుకుంటున్నారని చూపిస్తున్నాయి.
బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి ధరలు నేడు కిలోకు రూ.1,12,000 వద్ద స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు రూ.800 తగ్గి కిలోకు రూ. 1,12,000 వద్ద ముగిశాయి.