PHOTOS

Hyderabad Real Estate: గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు బెటరా?..అపార్టుమెంట్లో ప్లాట్ బెటరా? ఇంటిని కొనుగోలు చేసేవారికి ఏది అనుకూలం..?

Hyderabad Real Estate:  ఇల్లు ప్రతి కుటుంబానికి అత్యవసరమైంది. ఆర్థిక ఇబ్బందులు లేనివారు ఇంటిని కొనుగోలు చేయడం ఈ రోజుల్లో పెద్దగా కష్టమైన పనికాదు. అయితే మధ్యతరగతి వారికి, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నవారికి సొంత ఇల్లు అనేది ఇప్పటికీ ఒక పెద్ద కలే అని చెప్పవచ్చు. అయితే చాలా మందికి ఎక్కడ, ఎలాంటి ఇల్లు కొనుగోలు చేయాలనే గందరగోళంలో ఉంటారు. గేటెడె కమ్యూనిటీలో ఇల్లు కొనుగోలు చేస్తే బెటరా..లేదంటే అపార్ట్ మెంట్లో ప్లాట్ కొంటే బెటరా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఇంటిని కొనుగోలు చేసేవారికి ఏ ఇల్లు అనుకూలంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

Advertisement
1/7
వారసులకు ఇంటిని ఆస్తిగా
వారసులకు ఇంటిని ఆస్తిగా

అద్దె ఇంట్లో ఎన్ని రోజులు ఉంటాం..సొంతంగా ఇల్లును కట్టుకుందాం..లేదా కొనుగోలు చేద్దామనుకునేవారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే సొంతిల్లు అనేది మనం ఉన్నంతకాలం చిరస్థాయిగా ఉండటమే కాదు..మన తర్వాత కూడా వారసులకు ఇంటిని ఆస్తిగా ఇవ్వవచ్చని చాలా మంది భావిస్తుంటారు.   

2/7
సొంతిల్లు కోసం
సొంతిల్లు కోసం

సొంతిల్లు కోసం బ్యాంకు లోన్స్ తీసుకుని మరీ ఇల్లును కొనుగోలు చేస్తారు.  సొంతిల్లుఅనేది సమాజంలో స్థాయి పెరగడమే కాకుండా శాశ్వత చిరునామా కూడా ఒకటి ఉంటుంది. అంతేకాదు ఇంటిని నచ్చిన విధంగా డిజైన్ చేసుకునే వీలుంటుంది. దీనికి కొంచెం ఎక్కువ ఖర్చు అయినా సరే సొంతంగా ఉంటుందన్నభావనవారిలో ఉంటుంది.   

3/7
ఇంటిని కొనుగోలు చేసేవారికి
ఇంటిని కొనుగోలు చేసేవారికి

అయితే చాలా మందికి  గేటెడె కమ్యూనిటీలో ఇల్లు కొనుగోలు చేస్తే బెటరా..లేదంటే అపార్ట్ మెంట్లో ప్లాట్ కొంటే బెటరా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఇంటిని కొనుగోలు చేసేవారికి ఏ ఇల్లు అనుకూలంగా ఉంటుందో చూద్దాం. 

4/7
గేటెడ్ కమ్యానిటీలో ఇల్లు: 
గేటెడ్ కమ్యానిటీలో ఇల్లు: 

గేటెడ్ కమ్యానిటీలో ఇల్లు:  గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు చుట్టూ ప్రవాహరీగోడతో రెండేకరాలు, ఆపైన స్థలంలో నిర్మించిన భవనాల సముదాయం. వీటిలో మళ్లీ రెండు ఎకరాలు ఉంటాయి. విల్లాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ, హైరైజ్ అపార్ట్ మెంట్ లతో కూడిని గేటెడ్ కమ్యూనిటీ, విల్యాల కమ్యూనిటీలో ఇండిపెండెంట్ హౌస్ వలే రెండు అంతస్తులో, మూడు అంతస్తులతోనే విల్లాలు నిర్మించి ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండె రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం కనీసం బంధువులను ఇంటికి పిలిపించుకోవడం కూడా సమస్యగా ఉంటుంది.   

5/7
గేటెడ్ కమ్యూనిటీ
గేటెడ్ కమ్యూనిటీ

గేటెడ్ కమ్యూనిటీల్లో స్విమ్మింగ్ పూల్, జిమ్, క్లబ్ హౌస్ వంటి సౌకర్యాల నిర్వహణకు ఎక్కువ మొత్తంలో నెలలవారీ మెయింటైనెన్స్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీలో వందలాది ఇల్లు ఉంటాయి. కాబట్టి ఊరికి దూరంలో ఉంటాయి. 

6/7
స్టాండలోనే అపార్ట్ మెంట్లు : 
స్టాండలోనే అపార్ట్ మెంట్లు : 

స్టాండలోనే అపార్ట్ మెంట్లు :  గేటెడ్ కమ్యూనిటీలతో పోల్చి చూస్తే సాధారణంగా తక్కువ ధరలోనేఇందులో ప్లాట్లు లభిస్తాయి. ఇవి మధ్య తరగతి కుటుంబాలకు తక్కువ బడ్జెట్లోనే ఇంటిని కొనుగోలు చేయాలనుకునేవారికి అనుకూలంగా ఉంటాయి.  స్టాండలోన్ అపార్ట్ మెంట్లలో నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి.  స్టాండలోన్ అపార్ట మెంట్లలో ఎంతమంది బంధువులైనా ఇంటికి పిలిపించుకునే అవకాశం ఉంటుంది.   

7/7
స్టాండలోన్ అపార్ట్ మెంట్లు
స్టాండలోన్ అపార్ట్ మెంట్లు

స్టాండలోన్ అపార్ట్ మెంట్లు నగర కేంద్రాల్లో ఉంటాయి. పాఠశాలలు, హాస్పిటల్స్, మార్కెట్లు, రవాణా సౌకర్యాలకు దగ్గరిలో ఉంటాయి. రోజువారీ జీవనానికి సౌకర్యవంతంగా ఉంటాయి.  మనుషులు అంతా ఒకేలా ఆలోచించరు. వారి అభిరుచులు కూడా వేర్వేరుగా ఉంటాయి. అయితే మిడిల్ క్లాస్ వారికి అత్యంత అనుకూలమైన నివాసాలు, స్టాండలోన్ అపార్ట్ మెంట్స్ బెటర్ అని చెప్పవచ్చు.   





Read More