PHOTOS

Employees Jackpot: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. జీతం కోసం రూ.లక్ష కోట్లు విడుదల

Jackpot To Employees Rs One Lakh For ELI Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు భారత ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి ప్రభుత్వం జాక్‌పాట్‌ ఆఫర్‌ ప్రకటించింది. జీతంతో పాటు అదనంగా రూ.15 వేలు వేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Advertisement
1/6

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి కేంద్ర మంత్రిమండలి కీలక ప్రకటన చేసింది. న్యూఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో ఉద్యోగులకు జాక్‌పాట్‌ లాంటి కబురు వినిపించింది.

2/6

దేశవ్యాప్తంగా రాబోయే రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రూ.లక్ష కోట్లతో ఎంప్లాయిమెంట్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (ఈఎల్‌ఐ) పథకానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తయారీ రంగంలో తొలిసారి ఉద్యోగంలో చేరే వారికి శుభవార్త ప్రకటించింది.

3/6

తొలిసారి ఉద్యోగంలో చేరే వారికి తమ నెల వేతనంలో ప్రావిడెంట్‌ ఫండ్‌ను రెండు విడతల్లో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈపీఎఫ్‌ రూ.15 వేలు జమ చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

4/6

1వ తేదీ ఆగస్టు 2025 నుంచి 31వ తేదీ జూలై 2027 మధ్య ఉద్యోగంలో చేరే వారికి ఎంప్లాయిమెంట్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (ఈఎల్‌ఐ) పథకానికి వర్తింపచేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

5/6

ఉపాధి ఆధారిత ప్రోత్సాహకం పథకాన్ని కేంద్ర బడ్జెట్ 2024-25‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాల కల్పన, ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ మంది కార్మికులను నియమించుకునేలా ప్రోత్సాహం కల్పించడమే ముఖ్య లక్ష్యం.

6/6

ఎంప్లాయిమెంట్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ పథకం ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. దీని మొత్తం బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు అంనా వేయగా.. మొదటి దశ కింద కేంద్రం రూ.1.07 లక్షల కోట్లు కేటాయిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.





Read More