Know About Indian Cricketers Assets And Net Worth: భారత క్రికెటర్లలో అత్యధిక ధనవంతుడు ఎవరో తెలుసా? విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీతోపాటు పాత క్రికెటర్లు ధనవంతుల జాబితాలో పోటీ పడుతున్నారు. అయితే వారికన్నా భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన క్రికెటర్ వేరొకరు ఉన్నారు. ఆయన వివరాలు తెలిస్తే షాకవుతారు.
అత్యంత ప్రజాదరణ కలిగిన క్రికెటర్లుగా సచిన్ టెండూల్కర్, కోహ్లీ, ధోని గుర్తింపు పొందారు. కానీ ఆస్తుల్లో మాత్రం వారి కన్నా ముందు వేరే క్రికెటర్ ముందు వరుసలో ఉన్నాడు. భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా దేశంలో అత్యంత ధనవంతుడైన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు.
భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఇప్పుడు భారతదేశంలో అత్యంత ధనవంతుడైన క్రికెటర్‌గా నిలిచాడు. కోహ్లీ, ధోని, టెండూల్కర్ వంటి వారిని అధిగమించి రూ.1,450 కోట్ల నికర విలువతో ఆస్తుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి 2000లో అజయ్ జడేజా రిటైర్ అయ్యాడు. అప్పటి నుంచి అజయ్ జడేజా పెట్టుబడులు, వంశపారంపర్యగా వచ్చిన ఆస్తుల ద్వారా అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. ఆస్తులు, సంపాదన భారీగా ఉన్నాయి.
భారతదేశంలో క్రికెట్ దేవుడిగా గుర్తింపు పొందిన ఆటగాడు సచిన్ టెండూల్కర్. క్రికెట్‌తోపాటు వ్యాపారాలు ఇతర సంపాదనల ద్వారా సచిన్ టెండూల్కర్ భారీగా సంపాదించాడు. సచిన్ ఆస్తుల నికర విలువ రూ.1,250 కోట్లకు పైగా ఉంటుంది.
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆస్తుల్లో మూడో స్థానంలో ఉన్నాడు. ఎంఎస్ ధోనీ ఆస్తుల నికర విలువ రూ.1,080 కోట్లు ఉంటుంది. ధోనీ స్టార్టప్, క్రీడా జట్లు, రియల్ ఎస్టేట్ ద్వారా భారీ ఆదాయం పొందారు.
కోట్లాది అభిమానం పొందిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆస్తుల్లో నాలుగో స్థానంలో ఉన్నాడు. క్రికెట్ సంపాదనతోపాటు వాణిజ్య ప్రకటనలు, వ్యాపార సంస్థల ద్వారా కోహ్లీ వేల కోట్లు సంపాదించాడు. విరాట్ కోహ్లీ ఆస్తుల నికర విలువ రూ.1,050 కోట్లకు పైగా ఉంటుంది.