PHOTOS

Mahesh Babu covid news: మహేష్ బాబు కుటుంబంలో కరోనా కలకలం.. వైరల్‌గా మారిన పోస్ట్.. టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్..

Shilpa shirodkar tests covid positive:  మరోసారి కరోనా మహామ్మారి ప్రజల్ని కలవర పెడుతుంది. ఇప్పటికే కోవిడ్ కేసులుమరోసారి వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా హాంకాంగ్‌, సింగపూర్‌ లాంటి ఆసియా దేశాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

Advertisement
1/5
మహేష్ బాబు కుటుంబంలో కరోనా:
మహేష్ బాబు కుటుంబంలో కరోనా:

గత కొన్ని వారాలుగా ఇన్‌ఫెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరగడమే కాకుండా ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది.ఈ క్రమంలో మహేష్ బాబు కుటుంబంలో కరోనా మళ్లీ ఎంట్రీ ఇచ్చింది.  

2/5
కరోనా మహామ్మారి:
కరోనా మహామ్మారి:

మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్  అక్క.. శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు.ఈ క్రమంలో తాను.. కోవిడ్ బారినపడ్డట్లు ఈ  భామ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ముఖ్యంగా శిల్పాశిరోద్కర్..  బిగ్ బాస్ 18 లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.

3/5
శిల్పా శిరోద్కర్:
శిల్పా శిరోద్కర్:

అయితే.. మహేష్ బాబు తన కుటుంబానికి ఎంతగా ప్రయారిటీ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం మహేష్ బాబు.. తన కుటుంబంలోకి మరోసారి కరోనా పాజిటివ్ రావడంతో టెన్షన్ కు గురౌతున్నారు.

4/5
మహేష్ బాబు:
మహేష్ బాబు:

ఈ క్రమంలో తన భార్య నమ్రత, పిల్లలకు కూడా కరోనా టెస్టులు చేయించుకొవాలని సన్నిహితులు సలహా ఇస్తున్నారు. అయితే.. ప్రస్తుతం శిల్పాశిరోద్కర్ క్వారెంటైన్ లో ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నటి కోరుతున్నారు.

5/5
కరోనా:
కరోనా:

మరోవైపు ఈ పోస్ట్ వైరల్ కావడంతో మహేష్ బాబు అభిమానులు ఎమోషలన్ అవుతున్నారు.  శిల్పాశిరోద్కర్ వెంటనే కోలుకొవాలని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అదేవిధంగా మహేష్ కుటుంబం కూడా కరోనా టెస్ట్ లు చేయించుకొవాలని చెబుతున్నారు. సరైనఫుడ్, జాగ్రత్తలు తీసుకుంటే.. తొందరగా తగ్గిపోతుందని చెప్తున్నారు.  





Read More