MLC Kavitha Follows Her Father KCR Sentiments: బీఆర్‌ఎస్ పార్టీలో కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ఆ పార్టీకి దూరమైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. తాను స్థాపించిన తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే సరికొత్త రాజకీయం చేస్తున్న ఆమె తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌నే ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఏం చేశారో తెలుసా?
తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న రాజకీయం చర్చనీయాంశంగా మారింది. తండ్రి, గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ పేరుతో ఆమె సరికొత్త రాజకీయం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీని కాకుండా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాజకీయం చేస్తున్న ఆమె తండ్రి బాటలోనే కవిత వెళ్తున్నారు.
తండ్రి కేసీఆర్ మాదిరి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితకు కూడా ఎంతో భక్తి ఉంది. దేవుడిని ఎక్కువగా విశ్వసిస్తారు. కేసీఆర్ లాగా తరచూ ఆలయాలను సందర్శించడం.. పూజలు చేయడం చేస్తుంటారు.
తండ్రి కేసీఆర్‌కు కాళేశ్వరం నోటీసులు జారీ చేయడంతో నిరసన దీక్ష చేపట్టిన ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం సీహెచ్ కొండూరు గ్రామంలో కవిత కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేయడం విశేషం.
సీహెచ్ కొండూరు గ్రామంలోని శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహ స్వామి ఆలయ తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన హోమంలో కుటుంబసభ్యులతో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
తన కుమారులతోపాటు అత్తింటి కుటుంబసభ్యులు కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు. తండ్రి ఆరోగ్యం కోసం ఈ పూజల్లో ప్రార్థించినట్లు తెలుస్తోంది.