Stones Between Railway Tracks Facts: చాలామందికి పట్టాలపై గులకరాళ్లు ఎందుకుంటాయి అనేది ఇప్పటికీ తెలియదు. నిజానికి ఇవి ఉండడం వల్లే రైలు ప్రమాదాలు తగ్గుతూ వస్తున్నాయని కొంతమంది చెబుతున్నారు. ఇవి రైలు వేగాన్ని కూడా పెంచేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి.
చాలామంది నిత్యం రైలు ప్రయాణం చేస్తూనే ఉంటారు. కొంతమంది అప్పుడప్పుడు చేసినప్పటికీ మరి కొంతమంది అయితే రోజు రెండుసార్లు తప్పకుండా రైలు ప్రయాణం చేస్తారు. అయితే రైలు ప్రయాణం చేసే క్రమంలో చాలామంది రైలు పట్టాలతో పాటు రైళ్లను చూస్తూ ఉంటారు. కొంతమంది పట్టాలను అదేపనిగా గమనిస్తూ ఉంటారు.
నిజానికి రైలు పట్టాల గురించి చాలామందికి అనేక సందేహాలు ఉంటాయి. అందులో కొంతమందికి కలిగిన సందేహమే రైలు పట్టాలపై ఎందుకు రాళ్లు ఉంటాయనేది? రైలు పట్టాల మధ్య ఎందుకు రాళ్లు ఉంటాయనేది ఇప్పటికీ చాలామందికి తెలియదు. దీనిని తెలుసుకోవడానికి చాలామంది గూగుల్ సెర్చ్ చేస్తున్నారు.
నిజానికి రైలు పట్టాల మధ్య గులకరాళ్ళు ఉండడం వల్ల రైలుకు కుషన్ లాగా పనిచేసేందుకు ఎంతగానో సహాయపడతాయి. దీని వల్ల రైలు పూర్తి వేగంతో వెళ్తున్నప్పటికీ దాని బరువును తగ్గించి కదలికలను మరింత సులభతరం చేస్తుందని సమాచారం. అందుకే పట్టాల నిర్వహణ కోసం చాలామంది రైల్వే ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటారట..
ముఖ్యంగా రైలు పట్టాల మధ్య గులకరాళ్లు ఉండటం వల్ల రైలు ప్రమాదాలు కూడా తగ్గుతాయని సమాచారం.. దీనివల్ల రైలు కూడా బ్యాలెన్స్ గా ముందుకు వెళ్తుందని తెలుస్తోంది.. కాబట్టి కొత్తగా నిర్మించే ప్రతి పట్టాలపై గులకరాళ్లు తప్పకుండా ఉంటాయి. అంతేకాకుండా అవి లేని చోట ఉద్యోగులు తప్పకుండా గులకరాళ్ళను నింపుతారు..
గులకరాళ్లు లేకుంటే ఇప్పటికీ ఎన్నో రైలు ప్రమాదాలు జరిగి ఉండేవట. అలాగే వర్షం నీరు రైలు పట్టాల చుట్టూ చేరినప్పటికీ ఈ రాళ్లు ఉండడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయట. అంతేకాకుండా ఇవి ఉండడం వల్ల ప్రయాణం మరింత సులభతరం అవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.