PHOTOS

Guru - Shukra Yuthi: గురు, శుక్ర గ్రహాల కలయిక వల్ల ఈ రాశుల వారికి బంపర్ లాభాలు.. ఆర్ధికంగా పుంజుకుంటారు..!

Guru - Shukra Yuthi: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. గురు, శుక్ర గ్రహాల కలయిక వలన కొన్ని రాశుల వారికి అనుకోని బంపర్ లాభాలను అందుకుంటారు. ఈ రెండు గ్రహాల కలయికను శుభయోగంగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం జూన్ 5న శుక్రుడు, దేవ గురువు బృహస్పతి ఒకదానికొకటి 60 డిగ్రీల కోణంలో ఉంటారు. ఇది గురు - శుక్ర దృష్టి అనుకోని లాభాలను కలిగించే అవకాశాలున్నాయి.

 

Advertisement
1/6
గురు శుక్ర యుతి
గురు శుక్ర యుతి

Guru - Shukra Yuthi:గురువు, శుక్రుని యొక్క అనుకూలమైన అంశం వృషభ రాశి  ప్రజలకు మానసిక స్థిరత్వం, దృఢ సంకల్పాన్ని అందిస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు సంయమనం పాటించే అవకాశం ఉంది. మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించే క్రమంలో అనుకోని లాభాలను అందుకుంటారు. ఈ సమయంలో, ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆదాయంలో పెరుగుదల ఉంగటుంది. మీ  అవసరాలను సులభంగా తీర్చుకోగలుగుతారు. కెరీర్‌లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో  ప్రమోషన్ సాధ్యమే. మీరు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే, ఈ సమయం మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. 

2/6
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి.. వృశ్చిర రాశి వారికి  ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు జీవితంలోని అనేక రంగాలలో విజయం సాధించే అవకాశం ఉంది. మీలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.  మీ నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు  పుష్కలంగా ఉన్నాయి.   విద్యార్థులకు కెరీర్‌లో మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారం విస్తరించబోతుంది. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా మరింత బలపడతారు. 

 

3/6
మిథున రాశి
మిథున రాశి

మిథున రాశి..

మిథుని రాశి వారికి గురువు, శుక్రుడి కోణం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో, మీరు అనేక రంగాలలో విజయం సాధిస్తారు. మీరు కొత్త వ్యక్తులను కలిచే అవకాశాలున్నాయి. ఇది మీ సామాజిక ఇతివృత్తాన్ని సూచిస్తోంది. కమ్యూనికేషన్, మీడియా, సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. కొత్త ఉద్యోగం పొందే బలమైన అవకాశం ఉంది. చేస్తోన్న  పనిలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి లాభాలను అందుకుంటారు. 

4/6
తులా రాశి
తులా రాశి

తులా రాశి..  తులా రాశి వారికి గురు, శుక్ర యోగం వలన మీరు ఇతరుల విశ్వాసం పొందుతారు.  మీ నిర్ణయాలపై దృఢంగా ఉంటారు. ఎటువంటి ఒత్తిడికి గురికారు. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. ఆదాయంలో మంచి లాభం అందుకుంటారు. కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు., గొప్ప లాభాలను సంపాదించవచ్చు. కార్యాలయంలో మీకు తగిన గౌరవంతో పాటు మీరు చేసే పనులకు  ప్రశంసలు లభిస్తాయి. సహోద్యోగులు సీనియర్ అధికారులు మీ ప్రయత్నాలను అభినందిస్తారు.

5/6
కుంభ రాశి
కుంభ రాశి

కుంభ రాశి..  కుంభ రాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో అత్యంత ఉన్నతమైనది. కళలు, సంగీతం, రచన, సాహిత్యం వంటి రంగాల్లో మీ ప్రతిభ ఏంటో ఇతరులకు తెలుస్తుంది.  మీకు మంచి ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. ఈ సమయం పెట్టుబడి రంగంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.  స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడుల వలన లాభాలను అందుకుంటారు. మీరు ఉద్యోగ రంగంలో కొత్త అవకాశాలను అందుకుంటారు.  కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇదే సదవకాశం. మీ సామర్థ్యాలను మెరుగుపరుచుకుని వారికి సరైన దిశానిర్దేశం చేయడానికి ఇది సమయం.

6/6
గమనిక
గమనిక

గమనిక: ఈ వ్యాసం సాధారణ సమాచారం, పండితులు,  హిందూ మత విశ్వాసాలు పండితులు చెప్పిన ఆధారంగా ఇవ్వబడింది. జీ న్యూస్  దీనిని ధృవీకరించడం లేదు. 

 





Read More