revanth reddy good news for unemployed youth: సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే తెలంగాణలోని వివిధ శాఖలలో వరుసగా ఉద్యోగ నియామకాల ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి పరుగులు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో భారీ శుభవార్తను చెప్పారు..
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు వరుసగా శుభవార్తలు చెప్తున్నారు. ఇప్పటికే గ్రూప్ ఎగ్జామ్ లను పకట్బందీగా నిర్వహించేలా ఆదేశాలు జారీచేసి, ఫలితాలు విడుదల చేసి పోస్టింగ్ లు కూడా ఇచ్చారు. ముఖ్యంగా పలు డిపార్ట్ మెంట్ లలో ఎగ్జామ్ లను కూడా ఎలాంటి కోర్టు ఆటంకాలు లేకుండా వివాదస్పదం కాకుండా.. రిక్రూట్ మెంట్ పూర్తయ్యేలా సమర్థవంతంగా చర్యలు తీసుకున్నారు.
ఈ క్రమంలో తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు మరో భారీ శుభవార్తను చెప్పారు. దీంతో సర్కారు కొలువు కోసం ఎదురు చూస్తున్న చాలా మందికి ఇది సువర్ణావకాశంగా చెప్పవచ్చు. ఈక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ ల భర్తీకి అనుమతిని ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు... మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకీ ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో ముఖ్యంగా వివిధ యూనీ వర్సీటీల పరిధిలోని 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు.
మరోవైపు.. జులై 18 నుంచి 19 సాయంత్రం వరకు అభ్యర్థులు ఏదైన మార్పులు ఉంటే.. ఎడిట్ చేసుకొవడానికి అవకాశం కల్పించారు. దీనిలో మల్టీ జోన్ 1 లో మొత్తం 379 పోస్టులు, మల్టీ జోన్ 2 మొత్తం 228 పోస్టులు ఉన్నాయి. ప్రొఫెసర్ పోస్టులకు జీతాలు.. యూని వర్సీటీ గ్రాండ్స్ ప్రకారం.. రూ. 68,900ల నుంచి రూ. 2,05,500 ఉందని నోటిఫికేషన్ వెల్లడించారు. అదే విధంగా మరో ఎనిమిది యూనీ వర్సీటీల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం రంగం సిద్దం చేస్తుంది. ముఖ్యంగా.. ఉస్మానియా యూనీవర్సీటీ, శాతావాహన యూనీ వర్సీటీ, కాకతీయ యూనీవర్సీటీ, పాలమూరు యూనీ వర్సీటీలలో ప్రొఫెసర్ ల పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ లో.. జులై 10 నుంచి ధరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అదే విధంగా.. చివరి తేదీ జులై 17, సాయంత్రం 5 వరకు మాత్రమే అప్లై చేయడానిక అవకాశం ఇచ్చారు. పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ లో ఆరోగ్యశాఖ విభాగం పొందుపర్చారు.