PHOTOS

Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఏ నగరంలో ఎంతంటే..?

Today Gold and Silver Price: మన దేశంలో బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గులు.. రూపాయి విలువ, ప్రభుత్వ ట్యాక్స్‌లు వంటి అనేక అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. బంగారాన్ని కేవలం పెట్టుబడిలా మాత్రమే కాకుండా.. మహిళలు బంగారాన్ని ధరించడం సెంటిమెంట్‌గా భావిస్తారు. ఏ ఫంక్షన్ జరిగినా బంగారం ధరించకుండా వెళ్లరు. అందుకే మన దేశంలో బంగారానికి భారీ డిమాండ్ ఉంటుంది.
 

Advertisement
1/5

ప్రస్తుతం మన దేశంలో బంగారం ధరలు ఒకే రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుతోంది. నేడు (జూన్ 10) బంగారం ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది.  

2/5

మంగళవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.97,680 కాగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.89,540. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,680గా ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,540గా ఉంది.  

3/5

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.95,500 కాగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.90,700గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,680 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,540గా ఉంది.   

4/5

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,680 రూపాయలుగా ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,540గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,830 ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,690గా ఉంది.      

5/5

విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 97,680 రూపాయలు ఉండగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.89,540గా ఉంది. వెండి ధర విషయానికొస్తే.. కిలో వెండి ధర రూ.లక్ష 8 వేల రూపాయలుగా ఉంది.    





Read More