PHOTOS

Best Movies in 2025: IMDb టాప్-10 మూవీస్ లిస్ట్ ఇదే.. ఫస్ట్ ప్లేస్ ఆ సినిమాదే..!

IMDb Top 10 Movies List: సినిమా రేటింగ్‌లు, రివ్యూలకు ఫేమస్ అయిన మూవీ డేటాబేస్ IMDb.. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి జూలై 1వ తేదీ వరకు విడుదలైన మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాలకు ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. టాప్‌-10లో 6 సినిమాలు బాలీవుడ్ నుంచి ఉంటే.. 2 తమిళ, మలయాళం ఇండస్ట్రీ నుంచి ఉన్నాయి. ఒక్క తెలుగు సినిమాకు కూడా చోటు లభించలేదు. టాప్ సినిమాల జాబితా ఇలా..

Advertisement
1/10

మరాఠా ఛత్రపతి శంభాజీ మహారాజ్ బయోపిక్‌గా రూ.130 కోట్లతో తెరకెక్కించిన ఛావా మూవీ బాక్సాఫీసు వద్ద రూ.809 కోట్ల వసూళ్లు రాబట్టాయి. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి IMDbలో 7.3 రేటింగ్ ఉంది.

2/10

తమిళ సూపర్ హిట్ మూవీ 'డ్రాగన్' టాప్‌-2లో చోటు దక్కించుకుంది. రదీప్ రంగనాథన్, గోపికా రమేష్ హీరోహీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా దాదాపు రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీకి IMDbలో 7.9 రేటింగ్ ఉంది.

 

3/10

షాహిద్ కపూర్, పూజా హెగ్డే జంటగా నటించిన దేవా మూవీ కమర్షియల్‌గా వర్కౌట్ కానప్పటికీ టాప్ 3లో నిలిచింది. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో మలయాళ చిత్రం ముంబై పోలీస్ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. దేవా మూవీ 6.7 IMDb రేటింగ్ పొందింది.

4/10

రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో అజయ్ దేవ్‌గన్, రితేష్ దేశ్‌ముఖ్, వాణి కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ రైడ్ 2. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రైడ్ (2018) సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది. రైడ్ 2 మూవీకి 6.8 IMDb రేటింగ్ వచ్చింది.

 

5/10

సూర్య, పూజా హెగ్డే జంటగా.. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో రూపొందిన చిత్ర రెట్రో. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాకు 6.7 IMDb రేటింగ్ ఉంది.

 

6/10

జాన్ అబ్రహం, సాదియా ఖతీబ్ కాంబోలో శివం నాయర్ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ది డిప్లొమాట్. భారత్-పాక్ సంబంధాల నేపథ్యంలో దౌత్యం ఇతివృత్తాలను, దౌత్యవేత్తలు ఎదుర్కొంటున్న వ్యక్తిగత సంఘర్షణలను తెరపై చక్కగా చూపించారు. ఈ సినిమా 7 IMDb రేటింగ్‌ను పొందింది.

 

7/10

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో లూసిఫర్‌కు కొనసాగింపుగా వచ్చిన మూవీ L2: ఎంపురాన్. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించగా.. అభిమన్యు సింగ్, టోవినో థామస్, మంజు వారియర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమాకు 6.2 IMDb రేటింగ్ ఉంది.

 

8/10

స్పోర్ట్స్ కామెడీ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో ఆర్.ఎస్.ప్రసన్న దర్శకత్వంలో సితారే జమీన్ పర్ మూవీ తెరకెక్కింది. స్పానిష్ మూవీ ఛాంపియన్స్‌కు రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీకి 7.3 IMDb రేటింగ్‌ ఉంది.  

9/10

కేసరి చాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్ సినిమాకు 8 IMDb రేటింగ్ లభించింది. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. కేసరి (2019) కి సీక్వెల్‌గా తెరకెక్కింది. 'ది కేస్ దట్ షుక్ ది ఎంపైర్' పుస్తకం ఆధారంగా రూపొందించారు.

 

10/10

మాగిజ్ తిరుమేని రచించి దర్శకత్వం వహించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ విదాముయర్చి. అజిత్ కుమార్, అర్జున్, త్రిష, రెజీనా కసాండ్రా, ఆరవ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు 6.2 IMDb రేటింగ్ వచ్చింది.

 





Read More