TTd latest news: తిరుమలకు ఇక మీదట సొంత వాహనాల్లో వెళ్లేవారు కొన్ని రూల్స్ తప్పకండా పాటించాలని టీటీడీ కీలక ఆదేశాలు జారీ చేసింది. మోతాదుకు మించి పొగను వెదజల్లే వాహనాల్ని తిరుమల కొండపైకి అనుమతించేంది లేదని స్పష్టం చేసింది.
తిరుమలలో ఇటీవల కొండపైన భారీగా రద్దీ పెరిగిపోయింది. గత నెల రోజుల నుంచి భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడంలేదు. ఇదిలా ఉండగా.. తిరుమలకు మన దేశం నుంచి మాత్రమే కాకుండా.. దేశ, విదేశాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తుంటారు. ఎన్ని గంటలైన కూడా క్యూలైన్ లలో వేచి ఉండి మరీ స్వామి వారి దర్శనంచేసుకుంటారు.
ఈ క్రమంలొ తిరుమలలో ఇటీవల భక్తులకు క్యూలైన్ లలో ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. అంతే కాకుండా.. తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో వారికి ప్రత్యేకంగా తాగునీరు, అల్పహారం వంటివి అధికారులు సరఫరా చేస్తుంది. మరోవైప తిరుమలలో అలిపిరి వద్ద వాహనాలు రద్దీ ఉండకుండా..అత్యధునిక హంగులతో స్కాన్ వ్యవస్థను డెవలప్ మెంట్ చేస్తున్నారు.
మరోవైపు తిరుమలలో ఇటీవల భారీగా భక్తుల రద్దీ పెరిగిపోయింది. చాలా మంది భక్తులు తమ సొంత వాహానాల్లో శ్రీవారి ఆలయంకు భారీగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రాంతంలో భారీగా పొల్యుషన్ పెరిగింది. దీంతో టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వాయుకాలుష్యం ఎక్కువగా విడుదల చేసే వాహనాల్ని అలిపిరి వద్ద ఆపేయనున్నారు.
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకున్నా, స్మోక్ మీటర్ రీడింగ్ 4.0 దాటినా కూడా వాహనాల్ని ఇక మీదట కొండ మీద అనుమతించరు. తిరుమలలో ప్రతిరోజు 8 వేలకు పైగా వాహనాలుకొండపైకి ఘాట్ రోడ్ మార్గంలో వస్తున్నాయి. దీంతో కొండపైన రద్దీ పెరిగిపోవడంతో.. టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
ముఖ్యంగా తిరుమలలో సొంత వాహనాల్లో వచ్చే భక్తులు ఈ విషయాన్నితప్పకుండా గుర్తుంచుకుని కండీషన్ ఉన్న వాహనంలోనే తిరుమలకు రావాలని టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఒకవేళ స్మోక్ మీటర్‌లో ఉద్గారాలు 4.0కు మించిఉంటే ఆ వెహికిల్ ను తప్పనిసరిగా వెనక్కు పంపిస్తామని టీటీడీ స్పష్టం చేసింది. దీంతొ సదరు భక్తులు స్వామి వారి దర్శనం అవకాశం కోల్పోయే చాన్స్ ఉందని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.