Wine Shops Close For 2 Days From 13 July To 15th Bonalu: తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుగుతున్న బోనాల పండుగ సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే తెలంగాణలో కాకుండా హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ ప్రాంతంలో మాత్రమే వైన్స్ దుకాణాలు మూసి ఉండనున్నాయి.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బోనాల పండుగ కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో అంగరంగా వైభవంగా చేసుకుంటారు. ఆషాఢ మాసం సందర్భంగా హైదరాబాద్ నగరం నెల రోజులు సంబరంతో మునిగిపోతుంది. ఈ బోనాల పండుగ చూసేందుకు రెండు కళ్లు చాలావు. మరి ఈ పండుగ సందర్భంగా ముక్క, సుక్క లేనిది పండుగనే ఉండదు.
ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగే హైదరాబాద్‌లో మద్యం కూడా భారీగా అమ్మకం జరుగుతోంది. అయితే బోనాల జాతర సందర్భంగా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా మద్యం దుకాణాలు బంద్ చేస్తారు. బోనాల సందర్భంగా హైదరాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ముందస్తుగా మద్యం దుకాణాలు మూసివేస్తున్నారు.
ఈ ఆదివారం జరగనున్న బోనాల జాతర సందర్భంగా రెండు రోజులు వైన్స్ దుకాణాలు మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. అయితే ఇది హైదరాబాద్ మొత్తం కాకుండా లష్కర్ బోనాలు జరిగే సికింద్రాబాద్ ప్రాంతంలో మద్యం దుకాణాలు మూత పడనున్నాయి.
జూలై 13వ తేదీ ఉదయం 6 నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు సికింద్రాబాద్ ప్రాంతంలో మద్యం దుకాణాలు మూసి వేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ హైదరాబాద్‌లో వైన్స్, బార్లు బంద్ మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కల్లు దుకాణాలను కూడా మూసి ఉంటాయని స్పష్టం చేసింది.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాల సందర్భంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయనున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి సెంట్రల్ జోన్‌లోని గాంధీ నగర్, ఈస్ట్ జోన్‌లోని చిలుకలగూడ పరిధిలోని చిలుకలగూడ, లాలాగూడ, వారాసీగూడ, నార్త్ జోన్‌లోని బేగంపేట, గోపాలపురం పరిధిలోని గోపాలపురం, తుకారం గేట్, మారేడుపల్లి, మహంకాళీ పరిధిలోని మహంకాళీ ప్రాంతం, రాంగోపాల్‌పేట్, మార్కెట్ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు బంద్ ఉండనున్నాయి.