YS Sharmila Gets Emotional With YS Vijayamma At YSR Ghat Pics Goes Viral: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్‌లో మంగళశారం ఘనంగా జరిగాయి. తన తండ్రి జయంతి సందర్భంగా ఆయన కుమార్తె వైఎస్ షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ఫొటోలు ఇవే..
తనకు జన్మనిచ్చిన తండ్రి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుమార్తె వైఎస్ షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రి సమాధి వద్ద కూర్చొని మౌనంగా కూర్చుని ప్రార్థించారు.
వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ను మంగళవారం వైఎస్ షర్మిల సందర్శించారు. తండ్రి సమాధికి పుష్పాంజలి ఘటించారు. అంతకుముందు మత పెద్దలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
కుటుంబపరంగా ఒంటరిగా మారడం.. ఆస్తుల వివాదం కొనసాగుతుండడంతో వైఎస్ షర్మిల కొన్నాళ్ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ విషయాలను తన తండ్రి సమాధి వద్ద గుర్తుచేసుకుని బాధపడినట్లు ఆ దృశ్యాలు చూస్తే కనిపిస్తోంది.
తండ్రికి నివాళుర్పించిన అనంతరం ఆ ఫొటోలు, వీడియోలను షర్మిల సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'ప్రజా సంక్షేమం పేరుతో జనం గుండెల్లో చెరగని సంతకం చేసిన మహానేత వైఎస్సార్. నా ప్రతి అడుగులో నాన్న నాకు మార్గదర్శి. నాన్న నాకు స్ఫూర్తి' అని తన తండ్రి వైఎస్సార్‌ను గుర్తుచేసుకుని షర్మిల 'ఎక్స్'లో పోస్టు చేశారు. తండ్రికి నివాళుర్పిస్తున్న ఫొటోలను పంచుకున్నారు.
'మహానేత వైఎస్సార్ 76వ జయంతి సందర్భంగా అమ్మతో కలిసి వేడుక జరుపుకోవడం అత్యంత సంతోషాన్ని ఇచ్చింది' అని వైఎస్ షర్మిల 'ఎక్స్'లో ఓ వీడియో పోస్టు చేసింది. ఆ వీడియోలో తల్లి విజయమ్మతో కలిసి కేక్ కోస్తున్న దృశ్యాలు ఉన్నాయి. కేక్ ఒకరికొరు తినిపించుకున్న అనంతరం విజయమ్మ తన కుమార్తె షర్మిలకు ముద్దు ఇచ్చారు.