Girls Hostel King Cobra: తెలంగాణలో ఆషాఢ మాసం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆషాఢ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా గ్రామ దేవతలను పూజించే మాసంగా గుర్తిస్తారు. అయితే ఈ మాసం ప్రారంభమైన తొలిరోజే నాగుపాము ప్రత్యక్షం కావడం విశేషం. నాగు పాము పడగవిప్పి బుసలు కొట్టింది. అయితే నాగుపామును చూసి భయపడడంతో దాన్ని స్నేక్ స్నాచర్లు వచ్చి పట్టుకుని సురక్షితంగా అటవీప్రాంతంలో వదిలారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Bank Holidays: రేపటి నుంచి 3 రోజులు బ్యాంకులకు సెలవు.. ఎందుకో తెలుసా?
మహబూబాబాద్‌లో బయ్యారం రోడ్డులో ప్రభుత్వ జిల్లా వైద్య కళాశాల ఉంది. దానికి అనుబంధంగా వసతి గృహం కొనసాగుతోంది. వసతిగృహ భవనంలో విద్యార్థినులు ఉంటున్నారు. అయితే బుధవారం రాత్రిపూట హాస్టల్‌లోకి నాగుపాము దూరింది. నాగుపాము ప్రవేశించడంతో విద్యార్థినిలు హడలెత్తిపోయారు. పాము కనిపించడంతో విద్యార్థినిలు పరుగులు పెట్టి భయబ్రాంతులకు గురయ్యారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్ధినిలకు ప్రైవేట్ వసతి భవనం ఏర్పాటు చేశారు. కొంత అటవీ ప్రాంతానికి చేరువగా ఈ భవనం ఉండడంతో పాముల బెడద అధికంగా ఉంది. దీంతో విద్యార్థినులు భయంభయంతో ఉంటున్నారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్.. ఆ పథకం మరో ఏడాది పొడిగింపు
నాగు పాము ప్రవేశించి కలకలం రేపడంతో విద్యార్థినిలు ఆందోళనకు గురవగా వెంటనే అధికారులు స్పందించారు. వైద్య సిబ్బంది స్నేక్ స్నాచర్‌కు సమాచారం అందించారు. కొన్ని నిమిషాలకు అక్కడకు వచ్చిన పామును పట్టేవాళ్లు జాగ్రత్తగా గంట పాటు శ్రమించి నాగు పామును బంధించారు. ఆ పామును సీసాలో బంధించడంతో విద్యార్థినిలు, కళాశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పట్టుకున్న నాగుపామును పామును అడవి లో వదిలిపెట్టారు. కాగా ఆషాఢ మాసం తొలి రోజు అమ్మాయిల హాస్టల్‌లో దూరడం శుభమా? అశుభమా? అనే చర్చ జరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.