Man playing with bunch of snakes shocking video: సాధారణంగా పాములంటే ప్రతి ఒక్కరు భయంతో పారిపోతారు. చాలా మంది పాములు కన్పిస్తే కిలో మీటర్ దూరం పారిపోతారు. అసలు.. రాత్రిపూట తాడును చూసి కూడా పామని భ్రమపడేవారు చాలా మంది ఉంటారు. అయితే.. ఇటీవల కాలంలో పాములు ఎక్కువగా మానవ నివాసాల్లోకి వస్తున్నాయి.
ముఖ్యంగా అడవులు, కొండ ప్రాంతాలు, వ్యవసాయ పొలాలకు దగ్గరగా ఉన్న ఇళ్లలో పాములు ఎక్కువగా హల్ చల్ చేస్తుంటాయి. చాలా మంది పాముల్ని చూసి దూరంగా పారిపోతుంటే, కొంత మందిమాత్రం పాములతో చెడుగుడు ఆడుకుంటుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వ్యక్తికి పాముల్ని పట్టుకొవడం హబీనో మరేంటో కానీ.. మొత్తంగా అతను పాముల్ని పట్టుకుని రచ్చ రచ్చ చేస్తున్నాడు.
అడవికి వెళ్లి అక్కడ కుప్పలు తెప్పలుగా ఉన్న పాములను పట్టుకున్నాడు. అదేంటో బట్టల కుప్పల్ని పట్టుకున్నట్లు పాముల్ని పట్టుకున్నాడు. మరీ అన్ని పాములు అక్కడ ఒకేచోట ఉన్నాయో కూడా అర్థం కావట్లేదు. కానీ ఇతను మాత్రం పాముల్ని వాటి తోకలతో పట్టుకునిమరీ.. తన వీపు మీద పెట్టుకుని అదేదో బియ్యం సంచి మోసుకుని వెళ్తున్నట్లు స్టంట్ లు చేశాడు. ఒక చోట కూర్చుని తీరిగ్గా ఏదో డ్రింగ్ తాగుతూ మరో చేతిలో పాముల్ని పట్టుకుని రచ్చ చేస్తున్నాడు.
మరీ అవి విషపూరితమైన పాములు. పొరపాటునకాటు వేస్తే పరిస్థితి ఏంటని కూడా అతను ఆలోచించడంలేదు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొంత మంది మాత్రం ఏం భయ్యా.. ఇంత వయలెంట్ గా ఉన్నాడని కామెంట్లు పెడుతున్నారు.