Home> సోషల్
Advertisement

Marriage In Train Video: కదులుతున్న రైలులో యువతి మెడలో తాళి కట్టిన యువకుడు.. వీడియో ఇదే..

Marriage In Train Video Watch: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ జంట కదులుతున్న రైల్లో ఒకరికొకరు దండలు మార్చుకొని పెళ్లి చేసుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో యువకుడు తాళి కట్టడం కూడా మీరు చూడవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 

Marriage In Train Video: కదులుతున్న రైలులో యువతి మెడలో తాళి కట్టిన యువకుడు.. వీడియో ఇదే..

 Marriage In Train Video Watch Here: భారతదేశవ్యాప్తంగా నవంబర్ నుంచి డిసెంబర్ నెలలో ఎక్కువగా వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలోనే వివాహాలు భారీ మొత్తంలో చేసుకుంటారు. డబ్బున్న వారితో పాటు పేదవారు కూడా ఎంతో ఘనంగా వివాహం జరుపుకుంటారు. ప్రతి ఒక్కరికి వివాహమనేది జీవితంలో ఒక అద్భుతమైన రోజుగా భావించవచ్చు. అందుకే ఈరోజును ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే కొంతమంది ఖర్చులు తగ్గించుకోవడానికి దేవాలయాల్లో లేదా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇక ప్రేమ జంటల విషయానికొస్తే వారు ఎక్కడ పడితే అక్కడ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలోనే కొంతమంది తీసిన వీడియోలు వైరల్‌గా మారుతూ ఉంటాయి. తాజాగా ఓ ప్రేమ జంట పెళ్లి చేసుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. 

చాలామంది ప్రేమికులు దేవాలయాల్లో లేదా రిజిస్టర్ ఆఫీస్‌లలో పెళ్లిళ్లు చేసుకోవడం చూసి ఉంటాం. అంతేకాకుండా ఊరి గ్రామస్తుల మధ్య పెళ్లి చేసుకోవడం చూస్తూ ఉంటాం.  కానీ ఇటీవల ఓ ప్రేమ జంట వీటన్నిటికంటే భిన్నంగా పెళ్లి చేసుకుంది. ఏకంగా వారు కదులుతున్న రైలులో వివాహం చేసుకున్నారు.. దీనికి సంబంధించిన దృశ్యాలను తోటి ప్రయాణికులు వారి స్మార్ట్ ఫోన్స్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో వదిలారు. ఇప్పుడు ఈ వీడియోలు కాస్త వైరల్‌గా మారాయి. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 

వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రేమ జంట లోకల్ ప్యాసింజర్ ట్రైన్ లో ఎక్కడికో ప్రయాణం చేస్తోంది. అయితే ఉన్నట్టుండి వారి చుట్టూ కొంతమంది ముసురుకున్నారు. దీంతో ఇక్కడి నుంచి వారి కథ ప్రారంభమవుతుంది.. వీడియోలో యువతి, యువకుడిని రెండు చేతులు పట్టుకొని ఉండడం చూడొచ్చు. యువకుడు మాత్రం తన చేతిలో తాళిబొట్టును పట్టుకొని ఉన్నాడు. వారి చుట్టూ ఉన్న ప్యాసింజర్స్ ఫోన్లు పట్టుకొని కెమెరా ఓపెన్ చేసుకొని ఉండడం చూడొచ్చు. అక్కడున్న కొంతమంది ప్రయాణికులు ఆ యువతిని సీటుపై కూర్చోబెట్టి యువకుడిని తాళికట్టమని చెబుతున్నారు. అయితే ఆ యువకుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా యువతి మెడలో తాళి కట్టడం కూడా మీరు చూడొచ్చు. 

 
 
 
 
 

యువకుడు తాళి కట్టిన తర్వాత యువతి చేతికి అక్కడే ఉన్న ప్రయాణికులు పూలదండని ఇవ్వడం కూడా చూడొచ్చు. అలాగే ఆ యువకుడికి కూడా పూలదండని ఇస్తారు. దీంతో వారిద్దరూ ఒకరికొకరు పూలదండను మార్చుకుంటారు. చివరికి ఆ యువతి యువకుడిని హగ్ చేసుకుంటుంది. దీంతో ప్రయాణికులంతా వారిద్దరిని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్లిపోతారు. దీనికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను మ్యాక్స్ సూడమ 1999 అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 85 వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు లైక్ చేశారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

  

Read More