Dead body found inside python stomach in Indonesia video: సాధారణంగా అడవులు, దట్టమైన కొండ ప్రాంతాల్లో ఎక్కువగా కొండ చిలువలు సంచారం చేస్తుంటాయి. ముఖ్యంగా వానాకాలంలో వీటి సంచారం మరింత ఎక్కువగా ఉంటుంది. కొండ చిలువలు మనుషులపై కొన్ని సార్లు దాడులు చేసి అమాంతం మింగేస్తుంటాయి.
అందుకే అడవుల్లోకి లేదా పొలాల్లోకి సింగిల్ గా కాకుండా గుంపులుగా వెళ్లాలని నిపుణులు చెబుతుంటారు. ఈ క్రమంలో గతంలో కొండ చిలువలు అనేక రకాల జంతువుల్ని మింగిన వీడియోలను మనం చూశాం. అయితే.. తాజాగా.. ఇండోనేషియాలోని మజాపహిత్ గ్రామంలో వెలుగులోకి వచ్చిన ఘటన అందర్ని షాక్ కు గురిచేస్తుంది.
ఇండోనేషియాలోని మజాపహిత్ గ్రామంలో జరిగిన ఓ ఘటనలో 63 ఏళ్ల వ్యక్తిని ఓ కొండచిలువ మింగేసింది. 63 ఏళ్ల రైతు ఎల్ లా గత శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. అప్పటి నుంచి అతని కోసం చుట్టుపక్కలగ్రామాల్లో వెతుకున్నారు. ఎవరైన అతన్ని ఎత్తుకుని పోయారా..?.. ఏంటనీ కూడా అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఇదిలా ఉండగా.. తాజాగా.. ఆ పొలం దగ్గరగా ఉన్న అడవిలో కొంత మంది 22 అడుగుల భారీ కొండ చిలువను చూశారు. అది పూర్తిగా అచేతనంగా ఉంది. ఎటుకదల్లేకుండా ఉంది. వారికి అనుమానం వచ్చింది.వెంటనే కొండ చిలువపై దాడి చేసి చంపేశారు. దాని పొట్టను కత్తితో కట్ చేసి చూడగా.. దానిలో ఆ రైతు శవం కన్పించింది.
అంటే.. ఆ కొండ చిలువ మనిషిని అమాంతం మింగేసిందన్నమాట. అక్కడి వారు కత్తితో కోండచిలువ చర్మాన్ని ఒలుస్తుంటే.. దానిలో నుంచి వ్యక్తి డెడ్ బాడీ బైటకు వచ్చింది. అప్పుడు అతని మిస్సింగ్ మిస్టరీ వెనుక ట్రాజెడీ బైటపడింది.అక్కడున్న వారు. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్గా మారింది.