White King Cobra Viral Video Watch: మన ఇప్పటివరకు సోషల్ మీడియాలో నిజంగా ఒకటి, రెండు రంగులకు సంబంధించిన పాములను చూసి ఉంటాం.. అలాగే బయట కూడా గోధుమ రంగు లేదా బూడిద రంగులో ఉండే పాములను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం.. కానీ ఎప్పుడైనా మీరు తెలుపు రంగుతో కూడిన అత్యంత ప్రమాదకరమైన పాములు చూశారా? చాలామందికి సందేహం కలగవచ్చు తెలుగు రంగులో కూడా పాములు ఉంటాయని!.. అవును ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో చూస్తే.. మీ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది.. తెలుపు రంగులో కూడా కొన్ని రకాల కింగ్ కోబ్రాలు ఉంటాయని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
మనం సోషల్ మీడియాలో ఎక్కువగా బూడిద రంగులో ఉండే.. కింగ్ కోబ్రాను మాత్రమే చూసి ఉంటాం.. అప్పుడప్పుడు నలుపు రంగులో ఉండే కింగ్ కోబ్రాలు చూస్తూ ఉంటాం.. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుపు రంగుతో కూడిన కింగ్ కోబ్రా వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వీడియో చూసిన వారంతా తెలుపు రంగులో కూడా అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాలు ఉంటాయని సందేహం వ్యక్తం చేస్తున్నారు..ఇంతకీ ఈ వీడియోలో ఏముందో? వైరల్ అవ్వడానికి గల కారణాలు ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
చాలామంది కింగ్ కోబ్రాలంటేనే అత్యంత విషపూరితమైనవని భావిస్తూ ఉంటారు.. తెలుపు రంగు జాతికి సంబంధించిన కింగ్ కోబ్రాలు కొన్ని మాత్రమే విషపూరితమైనవని అధ్యయనాల్లో తేలింది. అయితే ఇవి కేవలం అరుదుగా మాత్రమే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. మిగతా కింగ్ కోబ్రా పాముల కంటే ఇవి చాలా భిన్నంగా ఉంటాయి..ముఖ్యంగా చాలా తక్కువగా ఇవి వేటాడుతాయని సమాచారం. ఇది ఇలా ఉంటే వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే తెలుపు రంగుతో కూడిన నాగుపాము పడగదిప్పి పచ్చని మైదానంలో అటు ఇటు తిరగడం మీరు చూడవచ్చు.
ఇలా తిరుగుతున్న కింగ్ కోబ్రాను చూసేందుకు జనాలంతా దాని చుట్టూ ముసురుకున్నారు. అంతేకాకుండా ఈ పామును చూసి చాలా మంది వారి స్మార్ట్ ఫోన్స్‌లో వీడియోలను చిత్రీకరించారు ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలే కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఇవి వైరల్‌గా మారాయి. అయితే ఈ పాములు కేవలం మహారాష్ట్రతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ నైరుతి ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయట.. వీటి పొడవు దాదాపు మూడు అడుగులు ఉంటుందని సమాచారం.. తెలుపు రంగులో కూడిన కింగ్ కోబ్రాల కళ్ళు నీలం లేదా ఏర్పురంగులో ఉంటాయట ఇవి కేవలం రాత్రిపూట మాత్రమే వేటాడేందుకు ఇష్టపడతాయట ఆహారం కోసం చిన్న చిన్న ఎలకలతో పాటు సీతాకోకచిలుకలు ఇతర కీటకాలను వేటాడుతాయని సమాచారం..
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి