Baba Vanga Predictions 2025: ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్, పాకిస్తాన్‌పై ప్రతీకార చర్యలు చేపడుతోంది. దీంతో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్ధృక్తతలు మరింత పెరిగాయి. అతి త్వరలోనే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కూడా టీవీల్లో చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే రెండు దేశాల మధ్య యుద్ధం పై ప్రఖ్యాత బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా కూడా ప్రిడిక్షన్ చేశారు. ఇప్పుడు ఈ ప్రిడిక్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఈ ప్రేడిక్షన్‌లో బాబావంగా ఏం చెప్పారు? ఈ రెండు దేశాల మధ్య మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి.. ఇప్పటికే భారత్ ఆపరేషన్స్ సింధూర్ పేరిట.. పాకిస్తాన్ పై ప్రదీకార చర్యలను చేపడుతోంది. ఇందులో భాగంగానే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయానే రీతిలో ప్రజల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ఇటీవల బాబా వంగాకు సంబంధించిన ప్రిడిక్షన్ కూడా వైరల్ అవుతోంది. ఇటీవల న్యూయార్క్ పోస్ట్ నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం, యూరప్ పునాదులను కదిలించే ఒక పెద్ద ఘర్షణ గురించి బాబావంగ తన ప్రిడిక్షన్లో క్లుప్తంగా వివరించారు. ఈ ఘర్షణలో భాగంగా ఎలాంటి దేశాలకు సంబంధించిన పేర్లను వెల్లడించక పోయిన.. త్వరలో మాత్రం మూడో ప్రపంచ యుద్ధంలాంటి వాతావరణం నెలకొంటుందని ఆమె తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ ఘర్షణల వల్ల ప్రకృతి కూడా కాస్త అస్తవ్యస్తంగా మారే ఛాన్స్ కూడా ఉందని బాబా వంగ తన ప్రిడిక్షన్‌లో తెలిపింది. అంతేకాకుండా 2025 సంవత్సరంలో జరిగే పెద్ద యుద్ధాల కారణంగా విధ్వంసకరమైన భూకంపాలు కూడా సంభవించవచ్చని ఆమె తెలిపారు. ఇప్పటికే 2025 సంవత్సరంలో మయన్మార్ లో దాదాపు 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భాగంగా దాదాపు 1700 మందికిపైగా మరణించారు. అంతేకాకుండా కొన్ని లక్షల మందికి పైగా స్థానికులు గాయాల పాలయ్యారు. అయితే యుద్ధం తర్వాత మరోసారి కూడా భారీ మొత్తంలో భూకంపం రావచ్చని బాబా వంగా తన ప్రిడింక్షన్లో తెలిపింది.
బాబా వంగా తెలిపిన ప్రిడిక్షన్ ప్రకారం, 2025 సంవత్సరంలో పెద్దయుద్ధం వస్తే అది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల సమస్యలకు దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయట. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లోనైతే ప్రకృతి విలయతాండవం కూడా చేసే అవకాశాలు ఉన్నాయని తన జోష్యంలో తెలిపింది. బాబా వంగా గతంలో అందించిన ప్రిడిక్షన్ 100% నిజమైన సంగతి తెలిసిందే.. అయితే పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం.. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? అని మునుముందు చూడాల్సిందే.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook