Panchama Raja Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం చాలా నెమ్మదిగా ఒక రాశి నుంచి మరొక రాశికి కదులుతూ ఉంటుంది. ఈ గ్రహం ఒక రాశిలోకి సంచారం చేయడానికి దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు సమయం పడుతుంది. ఈ సంచార సమయంలోనే కొన్ని రాశుల వారికి శని గ్రహం మంచి ఫలితాలను అందిస్తే.. మరికొన్ని రాశుల వారికి దుష్ప్రభావాలను అందిస్తాడని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే శని గ్రహ ప్రభావంతో ఏలినాటి శని కూడా కొన్ని రాశుల వారికి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం శని మీనరాశిలో సంచార దశలో ఉన్నాడు. అయితే ఇదే రాశిలో శుక్రుడు గ్రహం కూడా సంచార దశలో ఉంది. ఈ రెండు గ్రహాలు జూలై 17వ తేదీన ఒకదానికొకటి 72 డిగ్రీల కోణంలోకి వస్తాయి. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన వంచక రాజయోగం ఏర్పడుతుంది ఈ రాజయోగం చాలా అరుదుగా ఏర్పడుతూ ఉంటుంది. పంచక రాజయోగం జూలై 17వ తేదీన ఏర్పడబోతోంది. శని మీన రాశిలో వక్ర దశలోకి వెళ్లడం వల్ల ఈ సమయంలో శుక్రుడు కూడా కదలికలు చేయడం కారణంగా 72 డిగ్రీల కోణంలోకి ఈ రెండు గ్రహాలు రాబోతున్నాయి. దీనివల్ల ఈ అద్భుతమైన పంచక రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల అద్భుతమైన లాభాలు పొందబోతున్న రాశులేవో తెలుసుకోండి.
మకర రాశి
మకర రాశి వారికి శని, శుక్ర గ్రహాలు ఒకదానికొకటి 72 డిగ్రీల కోణంలోకి రావడం వల్ల ఏర్పడే పంచక రాజయోగం చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా శుక్రుడు మకర రాశి వారి జాతకంలోకి ఐదో స్థానంలో సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల వీరికి కుటుంబ పరంగా చాలా మేలు జరుగుతుంది. అలాగే ఆధ్యాత్మికతవైపు మొగ్గుచూపగలుగుతారు. మకర రాశి వారికి ఈ సమయంలో కొన్ని సానుకూలమైన మార్పులు వస్తాయి వీరికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు కొత్త అవకాశాలు కూడా పొందగలుగుతారు. తోబుట్టులతో సంబంధాలు మరింత మెరుగుపడతాయి. అలాగే ఈ సమయం చాలా శుభప్రదంగా మారబోతోంది. కుటుంబ సభ్యులతో కూడా ఎంతో ఆనందంగా గడపగలుగుతారు.
వృషభ రాశి
వృషభ రాశి వారికి పంచమ రాజయోగం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వీరికి వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. అలాగే దీర్ఘకాలిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎప్పటినుంచో ఒత్తిడికి గురవుతున్న వారికి ఈ సమయంలో కాస్త ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం కూడా విపరీతంగా పెరుగుతుంది. వృషభ రాశి వారికి పనిలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా వీరిపై వీరికి మంచి అవగాహన ఏర్పడి ఇతరులతో ఎలా ఉండాలో నేర్చుకోగలుగుతారు. ప్రేమ జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి పంచమ రాజయోగ ప్రభావం విశేషమైన ప్రయోజనాలను అందించబోతోంది. వీరికి డబ్బు సంబంధిత సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఉద్యోగాలపరంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో ఉద్యోగాలు చేసేవారు మంచి బాధ్యతలు కూడా పొందగలుగుతారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి