Sarvartha Siddhi Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం పరంగా పోయిన శనివారం ఎంతో ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే సూర్యుడు ఉదయం 4:57 నిమిషాలకు ఈరోజు ఉదయించాడు.. ఆ తర్వాత ఈ సూర్యుడు 6:25 నిమిషాలకు అస్తమించాడు. అయితే ఇదే సమయంలో కొన్ని ప్రత్యేకమైన యోగాలు కూడా ఏర్పడ్డాయి. దీనివల్ల ఈ శనివారానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఈ సమయంలో చంద్రుడు రోజంతా తులా రాశిలో ఉన్నాడు. ఈ సమయంలో చంద్రుడు తులా రాశిలో సంచార దశలో ఉండడం వల్ల ప్రత్యేకమైన సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడింది. ఈ సిద్దయోగం జ్యోతిష్య శాస్త్రం పరంగా చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ యోగం వల్ల ఏర్పడే ప్రభావంతో కొన్ని రాశుల వారు విశేషమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. అయితే ఈ యోగ ప్రభావం ఏయే రాశుల వారికి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకోండి..
మేషరాశి
మేష రాశి వారికి ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా విదేశీ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే వారికి ఈ సిద్దయోగ ప్రభావంతో మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే స్నేహితుల సహకారం లభించి.. కొన్ని పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు. ముఖ్యంగా మేషరాశి వారి కుటుంబ సమస్యలతో బాధపడుతుంటే ఈ సమయంలో పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా కొత్త కార్లు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
మిథున రాశి
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా సర్వార్థ సిద్ధి యోగం ప్రభావంతో వీరు ఎప్పటినుంచో చేస్తున్న పనుల్లో విజయాలు సాధించగలుగుతారు. అలాగే పాత ఆస్తులను అమ్మేసి కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామితో సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా జీవితం కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు సాగుతుంది..
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న వ్యక్తులు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టే క్రమంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్స్ వస్తువుల విభాగాల్లో పనులు చేసే వ్యక్తులు మంచి లాభాలు పొందగలుగుతారు. తండ్రి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి సిద్దయోగ ప్రభావంతో తెలివితేటలు మరింత పెరుగుతాయి. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో వివాహాలు కూడా ఖరారు అయ్యే అవకాశాలున్నాయి. ఇక సింగిల్‌గా ఉండే వ్యక్తులకు మంచి భాగస్వామి కూడా పరిచయమవుతుంది. అలాగే ఊహించని ఆదాయం కూడా భారీ మొత్తంలో పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మకర రాశి
మకర రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో గౌరవం విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. అలాగే వీరి తెలివితేటలతో పనులు ఎంతో చకచగా చేయగలుగుతారు. నిర్ణయాలు కూడా చాలా బాగా తీసుకుంటారు అలాగే బంధువుల ప్రోత్బలంతో కుటుంబంలో అశాంతి నెలకొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారితో ఎంతో జాగ్రత్తగా ఉండడం మంచిది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి