MS Dhoni Retirement: కెప్టెన్ కూల్‌గా క్రికెట్‌లో గుర్తింపు పొందిన భారత క్రికెట్ మాజీ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని ఎట్టకేలకు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయని.. ఈ సీజన్ చివరి రోజు 'గుడ్‌బై' ప్రకటన చేసే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోరంగా విఫలమై పాయింట్ల పట్టికలో చివరన నిలుస్తోంది. జట్టు గడ్డు పరిస్థితుల్లో ఉండడం.. ఫామ్‌లో లేకపోవడం వంటి కారణాలతో ఇక ధోనీ వైదొలుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: IPL 2025: ఆ అన్నారు. ఆహా అన్నారు.. ఓహో అన్నారు.. లాస్ట్ కి తుస్సుమన్నారు..SRH కథ కంచికి
ధోని రిటైర్ ఎప్పుడూ?
2023లో తన 5వ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ భావించారు. కానీ నాటి నుంచి నేటి వరకు ఇంకా రిటైర్‌మెంట్ ప్రకటించకపోగా క్రికెట్‌లో మాత్రం ఆయన రిటైర్మెంట్ తీవ్ర చర్చ నడుస్తోంది. రెండు సీజన్లుగా ధోనీ తన అభిమానుల కోసం మాత్రమే ఆడుతున్నాడు. చివరి రెండు ఓవర్లలో మాత్రమే బ్యాటింగ్‌కు వచ్చే ధోని ఇప్పటికీ వికెట్ కీపింగ్‌లో ఎప్పటిలాగే చురుగ్గా ఉన్నాడు. బ్యాటింగ్‌లో.. నాయకత్వంలో కూడా ధోనీ విఫలమవుతున్నాడనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితిలో ధోని తన రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని విస్తృతంగా చర్చ జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధోని ఆట చూడటానికి అతడి తల్లిదండ్రులు స్టేడియానికి వచ్చారు. చెన్నైలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ కోసం ధోని తల్లిదండ్రులు, భార్య, పాప ప్రత్యక్షమైన విషయం తెలిసిందే.
Also Read: PBKS vs LSG: పంజాబ్ ప్లేఆఫ్స్‌లో పక్కా.. లక్నో సూపర్ జియాంట్స్ ఆరో ఓటమి
సక్సెస్‌కు మారుపేరు ధోనీ
భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా.. ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ విజయవంతం సాధించాడు. విజయాలకు పెట్టింది పేరుగా ధోనీ నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా ఇప్పటివరకు అతను 5 ట్రోఫీలను గెలుచుకున్న విషయం తెలిసిందే. అతను 2024లో తన కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్‌కు ఇచ్చాడు. అప్పటి నుంచి ధోనీ చెన్నై తరపున ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్నాడు. చేతి గాయం కారణంగా రుతురాజ్ మొత్తం ఐపీఎల్ నుంచి వైదొలగడంతో ధోని మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది.
చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ 2025 సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు వారి అభిమానులకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయేది. మెగా వేలం తర్వాత జట్టు కలయిక సరిగ్గా లేదు. వరుస ఓటములతో ఈ సీజన్‌లో అత్యంత ఘోర ప్రదర్శన చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో రెండు విజయాలను మాత్రమే నమోదు చేసింది. ఒకటి రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో అయితే.. ఒకటి ధోని నాయకత్వంలో గెలిచింది. ఐపీఎల్‌లో వరుసగా రెండేళ్లుగా ప్లే ఆఫ్ రౌండ్‌కు చెన్నై జట్టుఅర్హత సాధించకపోవడం ఇదే తొలిసారి. ఓటమికి ప్రధాన కారణం రాహుల్ తిరుపతి, విజయ్ శంకర్, దీపక్ హుడాల పేలవమైన ప్రదర్శనగా చర్చ జరుగుతోంది.
అంకుల్స్ జట్టులో యువకులు
అప్పుడే ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని జోరుగా చర్చ జరగ్గా ఇప్పటివరకు చేయలేదు. ఆ సమయంలో రుతురాజ్ గాయం కారణంగా వైదొలిగిన నేపథ్యంలో రిటైర్మెంట్ ప్రకటించలేదు. అయితే ఈ సీజన్ ముగిసిన తర్వాత ధోని తన రిటైర్మెంట్ ప్రకటిస్తాడని తెలుస్తోంది. సీజన్ ముగిసిన అనంతరం ఈ ప్రకటన చేసే అవకాశం లేకపోలేదు. ధోనీ రిటైర్మెంట్ వేళ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొన్ని భారీ మార్పులు జరుగుతున్నాయి. అంకుల్స్ జట్టుగా పేరొందిన చెన్నై జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తున్నారు. వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్ ఊర్వశి పటేల్ ఎంపిక అందులో భాగమే. ధోని 2026 సీజన్ కూడా ఆడతాడని భావిస్తున్న అతడి అభిమానులకు కొన్ని రోజుల్లో నిరాశ తప్పదని తెలుస్తోంది. మరి ధోనీ రిటైర్మెంట్ వార్త ఎప్పుడనేది క్రీడా ప్రపంచంలో చర్చ నడుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.