IPL 2025 Highlights: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో మాజీ ఛాంపియన్లకు ఏమైందో తెలియదు. టాప్ జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ ఘోరంగా విఫలమవుతోంది. తాజా సీజన్‌లో మరొక ఓటమిని చవిచూసి హ్యాట్రిక్ పరాజయాలను ఖాతాలో వేసుకుంది. అంచనాలు లేని ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా ఆడుతూ వరుసగా మూడో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌పై 25 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటర్స్ విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి ఢిల్లీ 183 పరుగులు చేయగా.. 5 వికెట్లు కోల్పోయిన చెన్నై ఓవర్లు పూర్తయ్యే వరకు 158 పరుగులు చేసి ఓటమిని చవిచూసింది.
Also Read: LSG vs MI: ఉత్కంఠ మ్యాచ్‌లో ముంబై ఓటమి.. లక్నోకు మరో విజయం
టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సంచలన ఇన్నింగ్స్‌తో 77 పరుగులు చేశాడు. అభిషేక్ పరేల్ (33), త్రిస్టన్ స్టబ్స్ (24) స్కోర్‌తో పర్వాలేదనిపించారు. చెన్నై బౌలర్లు పొదుపు బౌలింగ్ వేస్తూ భారీ స్కోర్ చేయకుండా ఢిల్లీని నియంత్రించారు. ఖలీల్ అహ్మద్ 2, రవీంద్ర జడేజా, మహీష పతిరణ తలా ఒక వికెట్ పడగొట్టారు.
Also Read: KKR vs SRH Live: సన్‌రైజర్స్ హ్యాట్రిక్ ఓటమి.. సొంత గడ్డపై పరువు నిలబెట్టుకున్న కోల్‌కత్తా
ఢిల్లీ విధించిన 184 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఓవర్లు పూర్తి చేసుకున్నా విజయానికి 25 పరుగుల దూరంలో నిలిచి ఓటమిపాలైంది. విజయ్ శంకర్ అద్భుతంగా ఆడి నాటౌట్‌గా నిలిచాడు. 54 బంతుల్లో 69 పరుగులు చేయగా.. సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ బ్యాట్ పట్టి 30 పరుగులు చేశాడు. శివమ్ దూబే (18) మరోసారి తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యాడు. ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా వేసి చెన్నై స్కోర్ బోర్డును నియంత్రించి విజయం సాధించారు. విప్రజ్ నిగమ్ 2 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించగా.. మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌తో ఢిల్లీ హ్యాట్రిక్ విజయాలను అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా.. వరుసగా మూడు ఓటములను చవిచూసిన చెన్నై పాయింట్లు అమాంతం తగ్గిపోయాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.