IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ 18 ఫైనల్ పోరులో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ చేజిక్కించుకుంది. తొలి టైటిల్ కలను ఆర్సీబీ సాకారం చేసుకుంటే ప్రీతి జింటా ఆశలు నీరుగారిపోయాయి. లీగ్ దశలో టాప్‌లో నిలవడమే కాకుండా క్వాలిఫయర్‌లో ముంబైను మట్టి కరిపించిన పంజాబ్ కింగ్స్ ఎందుకు ఓడిపోయిందో తెలుసుకుందాం.
కర్ణుణి చావుకు కారణాలు అనేకం అన్నట్టు పంజాబ్ కింగ్స్ ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయి. క్వాలిఫయర్ 2లో ముంబైపై 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో చూపించిన తెగువ 191 పరుగుల లక్ష్యాన్ని సాధించడంలో లోపించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ ముందు ఉంచడం పంజాబ్ ఓటమికి ఓ కారణం. వాస్తవానికి పెద్ద స్కోరు కాకపోయినా ఆర్సీబీ బౌలింగ్, ఫీల్డింగ్‌తో పంజాబ్‌కు భారీ స్కోరుగా కన్పించి..ఒత్తిడికి లోనైంది.
ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ ఆరంభం బాగానే ఉన్నా మిడిల్ ఆర్డర్ సరిగ్గా ఆడలేదు. కృనాల్ పాండ్యా అద్భుతమైన స్పెల్‌తో కీలకమైన ప్రభ్ సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లీషు వికెట్లను పోగొట్టుకుంది. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇవ్వడంతో పంజాబ్ రన్ రేట్ తగ్గిపోయింది. ఏ ఇద్దరి మధ్య కూడా భారీ భాగస్వామ్యం లేకపోవడం ఆ జట్టు ఓటమికి మరో కారణం. ఫలితంగా ఒత్తిడి బాగా పెరిగిపోయింది. మిడిల్ ఆర్డర్‌లో స్కోర్ తగ్గడంతో రిక్వైర్డ్ రన్ రేట్ పెరిగింది.
ఇక కీలకమైన సమయాల్లో కీలకమైన వికెట్లు పోగొట్టుకుంది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లోనే కాకుండా ఇతర లీగ్ మ్యాచ్‌లో కూడా అద్భుతంగా రాణించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌లో కేవలం 1 పరుగుకే అవుట్ అయ్యాడు. నేహాల్ వధేరా కూడా 15 పరుగులకే అవుట్ అవడం మరో కారణంతో పంజాబ్ స్కోర్ ముందుకు కదల్లేదు. ఆఖరి ఓవర్లలో జోష్ హేజిల్ వుడ్, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్‌లు బౌండరీలు ఇవ్వకుండా కట్టడి చేయగలిగారు. పంజాబ్ జట్టు నుంచి ఒక్క శశాంక్ సింగ్ మినహా మరెవ్వరూ రాణించలేకపోయారు.
మొత్తానికి సమిష్టిగా ఆ జట్టు విఫలమైంది. తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్టు స్పష్టంగా కన్పించింది. కేవలం ఒత్తిడితోనే వికెట్లు పోగొట్టుకుంది. రిక్వైర్డ్ రన్ రేట్ పెరిగిపోవడంతో 18 ఏళ్ల కలకు దూరమైంది. ప్రీతి జింటా ఆశలు నీరుగారాయి.
Also read: IPL 2025 Prize Money: ఏ అవార్డు ఎవరికీ? ఒక్కొక్కరు ఎన్ని కోట్లు అందుకున్నారో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook