Best match Finishers: ఐపీఎల్ 2025 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. అన్ని ప్రాంచైజీలు ప్లేయింగ్ 11 కూర్పులు చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో క్రికెట్ అభిమానుల దృష్టి వివిధ జట్లలో ఉన్న మ్యాచ్ ఫినిషర్లపై పడింది. మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా ఇట్టే మార్చేయగలరు. అందుకే చాలా ఫ్రాంచైజీలు అలాంటి బెస్ట్ ఫినిషర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించాయి. ఈసారి ఐపీఎల్ 2025 సీజన్ 18లో వివిధ జట్లలో ఉన్న మ్యాచ్ ఫినిషర్ల గురించి తెలుసుకుందాం.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలకమైన ఆటగాడిగా ఉన్న హెన్రిచ్ క్లాసెన్ గురించి చెప్పుకోవాలి. ఇతడు ఎలాంటి బ్యాటర్ అంటే కొన్ని నిమిషాల్లోనే గేమ్ రూపురేఖలు మార్చగలడు. పేస్, స్పిన్ ఏదైనా సమానంగా ఎదుర్కోగలడు. నిలబడి సిక్సర్లు బాదగల దమ్మున్నోడు. గత ఐపీఎల్ మ్యాచ్‌లలో ఇది ప్రత్యక్షంగా అందరూ చూసిందే.
కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు పవర్ హిట్టర్, చాలా తక్కువ సమయంలో ఎక్కువ పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి రింకూ సింగ్. ఎంత ఒత్తిడి ఉన్నా నిలదొక్కుకుని భారీ షాట్లు ఆడగలడు. పలు సందర్భాల్లో జట్టు విజయానికి కీలకమైన వ్యక్తిగా మారాడు.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నుంచి డేవిడ్ మిల్లర్ బెస్ట్ ఫినిషర్ అని చెప్పవచ్చు. గతంలో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన ఇతడిని ఈసారి లక్నో జట్టు కైవసం చేసుకుంది.
ఢిల్లీ కేపిటల్స్ జట్టు తరపున ఆడుతున్న ట్రిస్టన్ స్టబ్స్ బెస్ట్ ఫినిషర్లలో ఒకడు. ఇతడు నిలబడి ఆడితే చాలు మ్యాచ్ సొంతం అవుతుందనేది ఢిల్లీ ఫ్రాంచైజ్ నమ్మకం. చాలా సార్లు నిరూపించాడు కూడా.
పంజాబ్ కింగ్స్ లెవెన్ తరపున ఆడుతున్న శశాంక్ సింగ్ బెస్ట్ మ్యాచ్ ఫినిషర్. మ్యాచ్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అనుకూలంగా మార్చుకోగలడు. ఇక గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న యువ హిట్టర్ షారుఖ్ ఖాన్ బెస్ట్ మ్యాచ్ ఫినిషర్. ఇతడు పేరు తెచ్చుకున్నదే పవర్ హిట్టింగ్‌తో.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్న టీమ్ డేవిడ్ మరో బెస్ట్ మ్యాచ్ ఫినిషర్. విపత్కర పరిస్థితుల్లో కూడా రాణించగలడు. పవర్ హిట్టింగ్ ఇతని ప్రత్యేకత. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న షిమ్రాన్ హిట్మెయిర్ ఇప్పటికే చాలా సార్లు బెస్ట్ మ్యాచ్ ఫినిషర్ అని నిరూపించుకున్నాడు.
ఇక టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సీఎస్కే తరపున ఆడుతున్న ఎంఎస్ ధోని బెస్ట్ మ్యాచ్ ఫినిషర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా సందర్భాల్లో సీఎస్కేను ఆదుకున్నాడు. ఇక ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరో బెస్ట్ మ్యాచ్ ఫినిషర్. తనదైన హిట్టింగ్‌తో మ్యాచ్‌ను ప్రత్యర్థి చేతుల నుంచి లాక్కోగలడు.
Also read: IPL 2025 CSK Team: ఆరో టైటిల్ కోసం సిద్ధమౌతున్న చెన్నై సూపర్ కింగ్స్, ప్లేయింగ్ 11 ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి