CSK vs KKR Highlights: ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏమైంది? వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిపోవడం అనేది ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ లేదు. కోల్‌కత్తా నైట్‌రైడర్స్ చేతిలో చిత్తు చిత్తు అనే పదం కన్నా మరే పదం వాడవచ్చు. రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగగా.. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో బరిలోకి దిగినా కూడా చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి మారలేదు. ఐపీఎల్‌లోనే అతి తక్కువ స్కోర్‌కు పరిమితం చేయడమే కాకుండా పది ఓవర్లకు మ్యాచ్‌ను చుట్టేసి కోల్‌కత్తా విజయం సాధించడం విశేషం.
Also Read:RCB vs DC: కేఎల్ రాహుల్ సంచలన ఇన్నింగ్స్.. కొనసాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆధిపత్యం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ సొంత గడ్డపై అత్యంత పేలవ ప్రదర్శన చేసింది. వరుస వికెట్లు కోల్పోతూ.. తడబడుతూ అతి కష్టంగా 20 ఓవర్లు పూర్తి చేసి 103 పరుగులు చేయగా.. తొమ్మిది వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా, దీపక్ హుడా ఒక్క పరుగు చేయకుండా తీవ్ర నిరాశపర్చగా.. కెప్టెన్ ఎంఎస్ ధోనీతోపాటు నూర్ అహ్మద్ ఒక్క పరుగు మాత్రమే సాధించారు. టాపార్డర్ రచిన్ రవీంద్ర 4 పరుగులు చేయగా.. డేవాన్ కాన్వే 12 పరుగులు చేశాడు. రాహుల్ త్రిపాఠి (16) కొంత స్కోర్ చేయగా.. విజయ్ శంకర్ చేసిన 29 పరుగులు జట్టుకు కీలకంగా మారాయి. విజయ్ శంకర్‌కు సహకరిస్తూ శివమ్ దూబే బ్యాట్‌ను ఝులిపించి 31* పరుగులు చేశాడు. అతడు చేసిన స్కోర్ అత్యధిక పరుగులు కావడం విశేషం.
Also Read: Captain MS Dhoni: మళ్లీ కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ.. ఇక చెన్నై సూపర్ కింగ్స్ దశ మారుతుందా?
దయ చూపని బౌలర్లు
వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నైపై కోల్‌కత్తా బౌలర్లు ఏమాత్రం దయ చూపలేదు. స్కోర్ బోర్డును కదలనీయకుండా బంతులు వేసి చెన్నై బ్యాటర్లను బెంబేలెత్తించారు. మొదటి ఓవర్ నుంచి ఆఖరు బంతి వరకు చెన్నైపై బౌలర్లు చెలరేగిపోయి చుక్కలు చూపించారు. సునీల్ నరైన 3 వికెట్లు తీసి సీఎస్కేను భారీ దెబ్బతీయగా.. వారి కొనసాగింపుగా హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి వచ్చి తలా రెండు వికెట్లు పడగొట్టారు. వైభవ్ అరోరా, మొయిన్ అలీ చెరొక వికెట్ తీశారు.
ఈ సీజన్‌లోనే అత్యంత తక్కువ స్కోర్‌ను 10.1 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి కోల్‌కత్తా నైట్ రైడర్స్ 107 పరుగులు చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. క్వింటన్ డికాక్ 23 పరుగులతో రాణించగా.. సునీల్ నరైన్ 44 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. కెప్టెన్ అజింక్యా రహనే 20 పరుగులు చేయగా.. రింకూ సింగ్ 15 స్కోర్ చేశాడు. బౌలింగ్‌లో విఫలమవగా చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు కూడా ఘోరంగా విఫలమయ్యారు. వికెట్లు తీయడంలో ఏమాత్రం ప్రభావం చూపలేదు. అన్షూల్ కంబోజు, నూర్ అహ్మద్ మాత్రం ఒక్కొక్క వికెట్ తీశారు.
ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత ఘోర పరాభవం ఎదుర్కొంది. సీఎస్కే ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ పరుగులు చేయగా.. దాంతోపాటు వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిపోవడంతో అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది. ఏ ఐపీఎల్ సీజన్‌లోనూ చెన్నై ఇలాంటి ప్రదర్శన చేయలేదు. సీజన్ తొలి మ్యాచ్‌ను గెలిచిన చెన్నై అనంతరం జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలో బరిలోకి దిగిన సీఎస్కే ఘోర వైఫల్యం కనబర్చగా.. ధోనీ కెప్టెన్సీలో జరిగిన మ్యాచ్‌లోనూ జట్టు అదే ప్రదర్శన చేయడం గమనార్హం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి