IPL 2025 CSK Team: ఐపీఎల్ 2025 సీజన్ 18 మార్చ్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి అన్ని జట్లు సమూల మార్పులతో బరిలో దిగుతున్నాయి. చాలా జట్లకు సారధులు కూడా మారిపోయారు. గత సీజన్‌లో గ్రూప్ దశకే పరిమితమైన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి అదరగొట్టేందుకు ప్లేయింగ్ 11 సిద్ధం చేస్తోంది.
ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ ఐదు సార్లు టైటిల్ సాధించిన సీఎస్కే ఆరవ టైటిల్ కోసం అన్ని అస్త్రాల్ని సిద్ధం చేస్తోంది. ఈసారి సీఎస్కే జట్టులో సామ్ కుర్రాన్, డెవాన్ కాన్వే, రవిచంద్రన్ అశ్విన్, మహీంద్ర సింగ్ ధోని, రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే టీమ్ పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌తో ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో పతిరానా, నాథన్ ఎల్లిస్, నూర్ అహ్మద్ వంటి ఆటగాళ్లతో బలంగా ఉంది. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌ను రుతురాజ్ గైక్వాడ్ -డెవాన్ కాన్వే ప్రారంభించవచ్చని తెలుస్తోంది. లేదా డెవాన్ కాన్వే-రచిన్ రవీంద్ర ఓపెనర్లుగా దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్ మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉంటుంది. ఆల్ రౌండర్ కోటాలో శివమ్ దూబే, సామ్ కుర్రాన్, రవీంద్ర జజేజాలకు తిరుగులేదని చెప్పవచ్చు.
ఇక పేసర్లుగా మతీషా పతిరానా, అన్షుల్ కాంబోజ్ ఉంటే స్పిన్నర్‌గా అశ్విన్ కీలకం కానున్నాడు. మహీంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ కాకపోయినా అంతా అతని కన్నుసన్నల్లోనే నడవనుంది.
సీఎస్కే బెస్ట్ ప్లేయింగ్ 11
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా లేదా రాహుల్ త్రిపాఠి లేదా విజయ్ శంకర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, సామ్ కుర్రాన్, మతీషా పతిరానా, అన్షుల్ కాంబోజ్
బెంచ్‌కు పరిమితమయ్యే ఆటగాళ్లలో ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, షేక్ రషీద్, ముకేష్ చౌదరి, గుర్నప్నీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, శ్రేయస్ గోపాల్, వంశ్ బేడి, ఆండ్రీ సిద్ధార్ధ్, జామీ ఓవర్టన్ ఉండవచ్చు.
Also read: IPL 2025 SRH Team: భారీ అంచనాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్లేయింగ్ 11 ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి