Happy Birthday MS Dhoni: కూల్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.. ఈ పేరు ప్రపంచానికి పరిచయం అక్కర్లేదు. భారత క్రికెట్లో తనదైన ముద్రవేసిన ఈ దిగ్గజం ఝార్ఖండ్లోని రాంచీలో 1981 జులై 7వ తేదీన జన్మించాడు. భారత క్రికెట్ హిస్టరీలో తనకంటూ ఓ సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఎంఎస్ ధోని ప్రపంచ క్రికెట్ ను సైతం శాసించిన అత్యుత్తమ నాయకుల్లో ఒక్కడిగా ఎదిగాడు. నేడు మహేంద్రసింగ్ ధోని 44 పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మహేంద్రసింగ్ ధోని తండ్రి పాన్ సింగ్ మెకాన్ కంపెనీలో పంప్ ఆపరేటర్ గా పనిచేసేవారట. ధోని మొదట ఫుట్బాల్ కీపర్ గా తన క్రీడా జీవితాన్ని ప్రారంభించాడు. కానీ స్కూల్ కోచ్ చేసిన సూచనతో క్రికెట్ వైపు అడుగులు వేశాడు. వికెట్ కీపర్ గా తన సహజ ప్రతిభ బ్యాటింగ్లో దూకుడు శైలి ఆయన్ను అందరికంటే భిన్నంగా మారేలా చేసింది. తన ప్రతిభతో ఎంఎస్ ధోని త్వరగానే వెలుగులోకి వచ్చాడు.
కెరీర్ లో కీలక మలుపు:
1998లో సెంట్రల్ కో ఫీల్స్ లిమిటెడ్ జట్టులో చేరిన ధోని కెరీర్లో ఓ భారీ మలుపు తప్పిందని చెప్పవచ్చు. ధోని ప్రదర్శన చూసిన బీహార్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దేవర్శిష్ చక్రవర్తి సెలెక్ట్రకు ధోని పేరును సిఫార్సు చేశాడు. 2003-04 లో జింబాబ్వే కెన్యా పర్యటనకు వెళ్ళిన టీమిండియా ఏ జట్టులో ధోనికీ చోటు లభించింది. ఈ పర్యటలో అద్భుతంగా రాణించిన ధోని 2004లో బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ కి సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత పాకిస్తాన్ తో విశాఖలో 148 పరుగులు చేసి సంచలనం క్రియేట్ చేశాడు అని చెప్పవచ్చు. ఇక అప్పటినుంచి ధోనీ వెనక్కి తిరిగి చూడలేదు.
టీ20 ప్రపంచ కప్ 2007తో భారత జట్టు పగ్గాలు చేపట్టిన మహేందర్ సింగ్ ధోనీ తొలిటోర్నీలోనే భారత్ ను విజేతగా నిలిపాడు. తన నాయకత్వ పటిమను ప్రపంచానికి చాటి చూపాడు. ఆ తర్వాత తన సాధ్యంలో భారత జట్టుకు 2011 వన్డే ప్రపంచ 2013 ఛాంపియన్స్ ట్రోపీని అందించాడు. టెస్ట్ క్రికెట్ లోనే భారత్ ను నెంబర్ వన్ స్థానానికి చేర్చాడు.
వన్డే కెరీర్ విజయాలు:
ధోనీ అత్యంత బలమైన ఫార్మాట్ వన్డేలు. 350 వన్డేల్లో 50.57 సగటుతో 10,773 పరుగులు చేశాడు. 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు చేశాడు. ధోనీ భారత్ తరపున అత్యధిక వన్డే పరుగులు చేసిన ఆరవ ఆటగాడిగా నిలిచాడు. కెప్టెన్‌గా ధోనీ 200 వన్డేల్లో భారతజట్టుకు నాయకత్వం వహించాడు. వాటిలో 110 విజయాలు ఉండగా..74 ఓడిపోయాయి. వాటిలో 5 మ్యాచ్‌లు టై అయ్యాయి. అంతేకాదు ధోనీ 2011 ఐసిసి ప్రపంచ కప్, 2013 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ కు విజయాన్ని అందించాడు.
టీ20కి బాస్:
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్. భారత్ తరపున 98 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, 37.60 సగటు, 126.13 స్ట్రైక్ రేట్‌తో 1,617 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో హాఫ్ సెంచరీలు సాధించాడు.
టెస్ట్ క్రికెట్‌లోనూ సత్తాచాటి:
టెస్ట్ క్రికెట్ లాంటి సుదీర్ఘ ఫార్మాట్‌లో ధోని టీమిండియా తరపున 90 మ్యాచ్‌లు ఆడి 4,876 పరుగులు చేశాడు. భారత్ తరపున టెస్ట్‌లలో అత్యధిక పరుగులు చేసిన 14వ ఆటగాడిగా నిలిచాడు. టెస్ట్ కెప్టెన్‌గా 60 మ్యాచ్‌లలో జట్టుకు నాయకత్వం వహించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను క్లీన్ స్వీప్ (4-0) చేసిన ఏకైక భారత కెప్టెన్ ధోనీ రికార్డు క్రియేట్ చేశాడు. 2010-11, 2012-13 సిరీస్‌లలో ధోనీ సాధించిన ఘనత ఇది అని చెప్పవచ్చు.
మైదానంలో అడుగుపెట్టగానే:
ధోని మైదానంలోకి అడుగు పెట్టగానే...స్టేడియం మొత్తం 'ధోని-ధోని' నినాదాలతో హోరెత్తుతుంది. 23 ఏళ్ల వయస్సులో ధోని 2004లో భారత జట్టులోకి అడుగుపెట్టినప్పుడు..ఈ యువ ఆటగాడు క్రికెట్ ప్రపంచంలో ఇంత ఎత్తుకు చేరుకుంటాడని ఎవరూ ఊహించలేదు. అతని చురుకైన స్టంపింగ్, ఖచ్చితమైన క్యాచింగ్, అద్భుతమైన హెలికాప్టర్ షాట్లు, లాంగ్ సిక్సర్లు రాబోయే తరాలకు ప్రేరణ, ఉత్సాహాన్ని కలిగిస్తాయి.
చివరిగా..రెండు వరల్డ్‌కప్‌లు సాధించిన హీరో..సింపుల్ అండ్ బెస్ట్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఎంఎస్ ధోనీకి 44వ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతోంది జీ తెలుగు టీమ్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.