MS Dhoni Viral Photo: ఐపీఎల్ 2025 (ఇండియన్ ప్రీమియర్ లీగ్) నుండి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అనంతరం కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని తన స్వస్థలం రాంచీకి వెళ్లాడు. ఇప్పుడు మహికి సంబంధించి ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన ఫాం హౌజ్ లో ధోనీ చేపలు పడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అయితే ధోనీ ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన తర్వాత తన రిటైర్మెంట్ గురించి ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..తాను రాంచీకి వెళ్తానని అక్కడే చాలా సమయం గడుపుతానంటూ చెప్పుకొచ్చాడు. అన్నట్లుగా ధోనీ రాంచీలోని తన ఫాంహౌజ్ కు వెళ్లాడు. ధోనీకి కాస్త సమయం దొరికితే చాలు తన ఫాంహౌజ్ లో వాలిపోతుంటాడు.
Pic of the day 🐟 pic.twitter.com/tHmfQHA7W0
— Chakri Dhoni (@ChakriDhonii) May 29, 2025
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ నుంచి నిష్క్రమించగానే, మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ గురించి చర్చ చాలా తీవ్రంగా మారింది. ధోనీ తన రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ అనుకున్నారు. అయితే, ఇప్పటివరకు అలాంటి అధికారిక సమాచారం ఏదీ బయటకు రాలేదు. పదవీ విరమణ విషయంపై ధోని మాట్లాడుతూ... రాబోయే 4-5 నెలలు వేచి ఉండి కష్టపడి పనిచేస్తానని చెప్పాడు. దీని తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ 'కానుకల వర్షం'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook