Punjab Kings Beat Chennai Super Kings: ఆల్‌టైమ్ ఫేవరెట్‌గా జట్టుగా పేరు ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ వరుస మ్యాచ్‌ల్లో పరాభవం ఎదుర్కొంటూ ప్రతిష్టను దిగజార్చుకుంటోంది. గతంలో విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై ఇప్పుడు ఓటములకు కేరాఫ్‌గా నిలుస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బాట ఎల్లో ఆర్మీ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ చెన్నై చివరి వరకు పోరాటం చేసి నాలుగో ఓటమిని చవిచూసింది. 18 పరుగుల తేడాతో చెన్నైను ఓడించి పంజాబ్ కింగ్స్ జోరు కనబర్చింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి పంజాబ్ 219 పరుగులు చేయగా.. ఐదు వికెట్ల నష్టానికి చెన్నై 201 పరుగులకు పరిమితమైంది.
టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. యువ సంచలనం ప్రియాన్షు ఆర్య బ్యాట్‌తో దుమ్మురేపేలా ప్రదర్శన చేశాడు. 42 బంతుల్లో 103 పరుగులు చేసి సరికొత్త ఘనతను నమోదు చేసుకున్నాడు. 9 సిక్సర్లు, 7 ఫోర్లతో విరుచుకుపడి చెన్నై బౌలర్లను చితకొట్టాడు. ప్రభుసిమ్రాన్ డకౌట్ కాగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 9, స్టొయినీస్ 4, వధేరా 9, మాక్స్‌వెల్ ఒక పరుగు ఇలా అందరూ బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సుశాంక్ సింగ్ ప్రియాన్షుకు చక్కటి భాగస్వామిగా మారి దూకుడుగా ఆడాడు. 36 బంతుల్లో 52 పరుగులు * (3 సిక్సర్లు, 2 ఫోర్లు) చేశాడు. వరుస ఓటముల్లో పరాభవం ఎదురవుతుండగా ఈ మ్యాచ్‌లోనూ బౌలర్లు సత్తా చాటలేకపోయారు. ఓపెనర్‌గా దిగిన ప్రియాన్ష్‌ను చివరి వరకు ఔట్ చేయలేక ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ రెండేసి చొప్పున వికెట్లు తీయగా.. ముకేశ్ చౌదరి, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్యానికి ఛేదించడానికి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి 201 పరుగుల వద్ద నిలిచింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విఫలమవగా.. ఓపెనర్లు రచిన్ రవీంద్ర, డేవాన్ కాన్వే దూకుడుగా ఆడారు. గైక్వాడ్ 36 పరుగులు చేయగా.. కాన్వే అర్థ శతకం పూర్తి చేసుకుని అర్ధాంతరంగా వెనుదిరిగాడు. 49 బంతుల్లో 69 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శివమ్ దూబే (42), ఎంఎస్ ధోనీ (27) పరుగులు చేసి విజయం కోసం శ్రమించారు. బంతులు పూర్తవడంతో విజయానికి కొద్దిదూరంలో నిలిచిపోయారు. బౌలింగ్ దళం పెద్దదే ఉండగా వికెట్లు మాత్రం తక్కువ చ్చాయి. లాకీ ఫెర్గూసన్ 2 వికెట్లు పడగొట్టి సత్తా చాటగా.. యశ్ ఠాకూర్, గ్లెన్ మాక్స్‌వెల్ ఒక్కో వికెట్ తీశారు. చెన్నై సూపర్‌కింగ్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
బౌలింగ్, బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించినా కొన్ని తప్పిదాలు చెన్నై సూపర్ కింగ్స్ పరాజయం కావడానికి కారణాలుగా నిలుస్తున్నాయి. దీనికి తోడు ఫీల్డింగ్‌లో చాలా ఘోరంగా విఫలమయ్యారు. దాదాపు నాలుగు క్యాచ్‌లు ఫీల్డర్లు చేజార్చుకున్నారు. సీనియర్ జట్టు అని పేరు ఉన్నా ఆ పేరును మసకబారేలా చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.