RCB VS CSK: చెన్నై సూపర్ కింగ్స్ ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ లక్ష్యాన్నే నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. చివరిలో రుమిరియో షెఫర్డ్ అద్భుత బ్యాటింగ్ తో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ జోడి హాఫ్ సెంచరీతో చెలరేగింది. విరాట్ కోహ్లీ 33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో 62 పరుగులు చేశాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఐపీఎల్ 300 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. మరో ఓపెనర్ జాకబ్ 33 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 55 పరుగుల చేసి పెవిలియన్ బాట పట్టాడు.
ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయ్యాక స్కోర్ కాస్త తగ్గింది. దేవ్ దత్ పడిక్కల్ , రజత్ పాటిదార్ , జితే శర్మ పరుగులు చేశారు. ఇక చివరికి వచ్చిన షెఫార్డ్ మెరుపువేగంతో బ్యాటింగ్ చేశాడు. సిక్సర్లతో చెన్నై బౌలర్లను పరుగులు పెట్టించాడు. షెఫర్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. షెఫర్డ్ 14 బంతుల్లో 6 సిక్సర్లు, 4 ఫోర్ల సహాయంతో 53 పరుగులు చేశారు. 378. 57 స్ట్రయికర్ రేట్ తో పరుగులు చేశాడు. ఐఫీఎల్ వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. పాట్ కమ్మిన్స్, కేఎల్ రాహుల్ రికార్డు సమయం చేయగలిగాడు. వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్ మెన్ గా రికార్డు యశస్వి జైస్వాల్ పేరుమీదుంది. జైస్వాల్ కేవలం 13 బంతుల్లోనే ఈ రికార్డు క్రియేట్ చేశాడు. ఇక చెన్నై బౌలర్లలో మతీష పతిరాణాకు మూడు, శామ్ కర్రన్ కు ఒకటి, నూర్ ఆహ్మద్ కు తలో వికెట్ తీశారు.
Also Read: Mutual Funds: ఇన్వెస్టర్లు కోటీశ్వరులు చేసిన మిడ్ క్యాప్ ఫండ్స్ ఇవే..5ఏళ్లలో 38శాతం వరకు బంపర్ రాబడి
ఒకే జట్టు తరపున ఈ ఘనత సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు విరాట్ కోహ్లీ. చెన్నై బౌలర్ ఖలీల్ అహ్మద్ వేసిన మూడో ఓవరులో చివరి రెండు బంతులను విరాట్ భారీ సిక్సర్లుగా మలిచి ఈ ఫీట్ ను సాధించాడు. అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత ఆర్సీబీ మాజీ ఆటగాడు 263 సిక్సర్లతో క్రిస్ గేల్ ఉన్నాడు. ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మ 262, కీరన్ పోలార్డ్ 258 సిక్సర్లు కొట్టారు. చెన్నై తరపున ధోనీ 257 సిక్స్ లు బాదాడు.
Also Read: ITR filing: ఐటీఆర్ సమర్పించే సమయం ఆసన్నమైంది.. ఈ మార్పులు గమనించకుంటే నష్టపోతారంతే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి